IPL: ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియ పూర్తి

ఐపీఎల్ క్రికెట్ లవర్స్ ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2026 రిటెన్షన్ జాబితా వచ్చేసింది. డిసెంబరు 15 వ తేదీన అబుదాబిలో మినీ వేలం జరగనుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం రిటైన్, రిలీజ్ చేసే ఆటగాళ్ల వివరాలను అన్ని జట్ల ప్రాంఛైజీలు ప్రకటించాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) నుంచి అభినవ్ మనోహర్, అథ్వర తైడే, సచిన్ బేబీ, వియాన్ ముల్డర్, షమీ, సిమర్‌జిత్ సింగ్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపాను వదులుకుంది. కేకేఆర్ నుంచి ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యార్, డికాక్ లాంటి స్టార్లను రిలీజ్ చేసింది.
చెన్నైలోకి సంజూ శాంసన్
ఐపీఎల్ 2026కు ముందు ఆయా ఫ్రాంఛైజీల మధ్య జరిగిన ట్రేడ్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. తాజాగా ఎనిమిది మంది ఆటగాళ్ల ట్రేడ్ పూర్తయినట్టు ఐపీఎల్ ధ్రువీకరించింది. ముందునుంచి వార్తలు వస్తున్నట్లుగానే రవీంద్రజడేజా, సామ్‌కరణ్ రాజస్థాన్ రాయల్స్ గూటికి, సంజుశాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చారు. మహ్మద్ షమీ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మారాడు. సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్ తెందూల్కర్ ముంబయి ఇండియన్స్ నుంచి లఖ్‌నవూ జట్టులోకి వచ్చాడు. మయాంక్ మార్కండే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముంబయి టీమ్‌లోకి వచ్చాడు. నితీశ్ రాణా రాజస్థాన్ రాయల్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు, డోనోవన్ ఫెరీరా దిల్లీ క్యాపిటల్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చారు.
సంజూ కోసం విశ్వ ప్రయత్నం
అనుకున్నట్టుగానే ఐపీఎల్ 2026 సీజన్లో సంజూ శాంసన్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి ఆడబోతున్నాడు. అతన్ని సీఎస్‌కే టీమ్‌కి ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్, బదులుగా సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాని టీమ్‌లోకి తెచ్చుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 12 సీజన్లు ఆడిన రవీంద్ర జడేజాకి ఐపీఎల్ 2025 సీజన్లో రూ.18 కోట్లతో రిటెన్షన్ దక్కింది. అయితే దాన్ని రూ.14 కోట్లకు తగ్గించి, ట్రేడ్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2026 సీజన్లో రవీంద్ర జడేజా రూ.14 కోట్లు అందుకోబోతున్నాడు. అలాగే ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌లోకి వెళ్లబోతున్నాడు. అతన్ని రూ.2.4 కోట్ల ప్రస్తుత ధరకే ట్రేడ్ చేసుకుంది రాజస్థాన్ రాయల్స్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ ఖాయం కావడంతో తన ప్లేస్‌ని రిప్లేస్ చేయగల సత్తా ఉన్న వికెట్ కీపింగ్ బ్యాటర్ కోసం చూసిన చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది.
చెన్నైసూపర్ కింగ్స్ (సీఎస్‌కే) నుంచి మతిశా పతిరన, రాహుల్ త్రిపాఠి, వన్ష్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా, విజయ్ శంకర్, షేక్ రషీద్, కమలేశ్‌లు ఉన్నారు. ముంబయి ఇండియన్స్ సత్యనారాయణ రాజు, రీస్ టాప్లీ, కేఎల్ షీర్జిత్, కర్ణ్ శర్మ, బెవాన్ జాకబ్స్, ముజీబుర్ రెహ్మన్, లిజాడ్ విలియమ్స్, విజ్ఞేశ్ పుతుర్‌లను రిలీజ్ చేశారు. పంజాబ్ నుంచి 5 గురు ప్లేయర్స్ ఉన్నారు. ఆర్సీబీ నుంచి 8 , ఢిల్లీ నుంచి డుప్లెసిస్ లాంటి కీలక ఆటగాళ్లను రిలీజ్ చేశారు. గుజరాత్ టైటాన్స్ నుంచి ఐదుగురు, లఖ్‌నవూ నుంచి డేవిడ్ మిల్లర్‌తో పాటు 6 గురుని రిలీజ్ చేశారు. రాజస్థాన్ జట్టు నుంచి 7 మంది ప్లేయర్‌లు రీలీజ్ అయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

