IPL: కింగ్ శతక గర్జన- బెంగళూరు విజయ గర్జన

IPL: కింగ్ శతక గర్జన- బెంగళూరు విజయ గర్జన
X
కోల్‌కత్తాపై బెంగళూరు ఘన విజయం.. శతక గర్జన చేసిన కింగ్ విరాట్ కోహ్లీ... 192 పరుగులు చేసిన కోల్‌కత్తా

ఐపీ­ఎ­ల్‌ సీ­జ­న్ కీలక దశకు చే­రు­కు­న్న వేళ రా­య­ల్‌ ఛా­లెం­జ­ర్స్‌ బెం­గ­ళూ­రు జట్టు మరో­సా­రి తన దూ­కు­డు­ను చా­టిం­ది. ప్లే­ఆ­ఫ్స్‌ రే­సు­లో ఆధి­ప­త్యం ని­ల­బె­ట్టు­కో­వా­లం­టే తప్పక గె­ల­వా­ల్సిన మ్యా­చ్‌­లో ఆర్సీ­బీ అసా­ధా­రణ ప్ర­ద­ర్శన చే­సిం­ది. ము­ఖ్యం­గా స్టా­ర్ బ్యా­ట­ర్ వి­రా­ట్ కో­హ్లీ తన క్లా­స్‌, అను­భ­వం, దూ­కు­డు­తో కో­ల్‌­క­తా నై­ట్‌­రై­డ­ర్స్‌ బౌ­ల­ర్ల­ను పూ­ర్తి­గా కట్ట­డి చే­శా­డు. అతడి అద్భుత శత­కం­తో ఆర్సీ­బీ భారీ లక్ష్యా­న్ని సైతం అల­వో­క­గా ఛే­దిం­చి పా­యిం­ట్ల పట్టి­క­లో అగ్ర­స్థా­నా­న్ని అం­దు­కుం­ది. మరో­వై­పు ఈ ఓట­మి­తో కో­ల్క­త్తా, ప్లే­ఆ­ఫ్స్‌ అవ­కా­శా­లు దా­దా­పు ము­గి­సి­పో­యి­న­ట్టే కని­పి­స్తు­న్నా­యి. రాయ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ప్రారంభం నుంచే వేగంగా ఆడే ప్రయత్నం చేసింది. ఓపెనర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా పవర్‌ప్లేలో వేగంగా పరుగులు సాధించారు. అలెన్‌ వచ్చిన వెంటనే బౌండరీలతో దాడి ప్రారంభించాడు. ఒకే ఓవర్లో వరుసగా బౌండరీలు, సిక్సర్లు బాది బెంగళూరు బౌలర్లపై ఒత్తిడి తీసుకువచ్చాడు. అయితే అతడిని భువనేశ్వర్‌ అవుట్ చేయడంతో కేకేఆర్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఆ వెంటనే కెప్టెన్ రహానే కూడా తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన వెంటనే వికెట్ కోల్పోవడంతో కోల్‌కతా రెండో వికెట్‌ను కూడా త్వరగా కోల్పోయింది. అయిదో ఓవర్ ముగిసే సరికి జట్టు 48 పరుగులు చేసినా రెండు కీలక వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. అలాంటి సమయంలో యువ బ్యాటర్ రఘువంశీ ఇన్నింగ్స్‌ను చక్కగా నిలబెట్టాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం ఏమాత్రం ఆతురపడకుండా పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేశాడు. మొదట గ్రీన్‌తో కలిసి జట్టును గాడిలో పెట్టిన అతడు, తర్వాత రింకు సింగ్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

కోహ్లీ సమయం చిక్కినప్పుడల్లా బౌండరీలు సాధిస్తూ స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టి కోల్‌కతా స్కోరును 192 పరుగులకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. భారీ లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన బెం­గ­ళూ­రు జట్టు­కు ఆరం­భం­లో­నే ఓపె­న­ర్ బె­తె­ల్ వి­కె­ట్ కో­ల్పో­యి­నా, అక్క­డి నుం­చి మ్యా­చ్ పూ­ర్తి­గా వి­రా­ట్ కో­హ్లీ చే­తు­ల్లో­కి వె­ళ్లి­పో­యిం­ది. గత రెం­డు మ్యా­చ్‌­ల్లో వి­ఫ­ల­మైన కో­హ్లీ ఈసా­రి మా­త్రం మొ­ద­టి నుం­చే దూ­కు­డు­గా కని­పిం­చా­డు. బౌ­ల­ర్లు ఏ చి­న్న తప్పు చే­సి­నా శి­క్షిం­చా­ల­నే ధో­ర­ణి­తో బ్యా­టిం­గ్ చే­శా­డు. వై­భ­వ్ అరో­రా వే­సిన ఓవ­ర్లో వరుస ఫో­ర్లు బాది తన ఉద్దే­శా­న్ని స్ప­ష్టం చే­శా­డు. కా­ర్తీ­క్ త్యా­గి బౌ­లిం­గ్‌­లో కొ­ట్టిన సి­క్స్ ప్రే­క్ష­కు­ల­ను ఉర్రూ­త­లూ­గిం­చిం­ది. వి­రా­ట్ కో­హ్లీ కే­వ­లం 32 బం­తు­ల్లో­నే అర్ధ­శ­త­కం పూ­ర్తి చేసి తర్వాత మరింత వేగం పెం­చా­డు. ఒక్క దశలో కూడా అతడు ఆతు­ర­ప­డ­కుం­డా, లె­క్క­చే­సిన షా­ట్ల­తో స్కో­రు­ను ముం­దు­కు తీ­సు­కె­ళ్లా­డు. పడి­క్క­ల్ అవు­టైన తర్వాత కూడా కో­హ్లీ దూ­కు­డు తగ్గ­లే­దు. పా­టీ­దా­ర్‌, డే­వి­డ్ త్వ­ర­గా అవు­టై­నా అతడు మా­త్రం మ్యా­చ్‌­ను పూ­ర్తి­గా తన ని­యం­త్ర­ణ­లో ఉం­చా­డు. చి­వ­రి నా­లు­గు ఓవ­ర్ల­లో అవ­స­ర­మైన పరు­గు­ల­ను కూడా సు­ల­భం­గా మా­ర్చే­శా­డు. అను­కు­ల్ రాయ్ బౌ­లిం­గ్‌­లో ఫోర్, సి­క్స్ బాది సమీ­క­ర­ణా­న్ని పూ­ర్తి­గా బెం­గ­ళూ­రు వైపు తి­ప్పే­శా­డు. చివరకు జితేశ్ శర్మతో కలిసి కోహ్లీ విజయాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో 58 బంతుల్లో తన ఐపీఎల్ కెరీర్‌లో తొమ్మిదో శతకాన్ని నమోదు చేశాడు. మొత్తంగా 60 బంతుల్లో 105 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి.

కోహ్లీ రికార్డుల హోరు

చివరకు జితేశ్ శర్మతో కలిసి కోహ్లీ విజయాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలో 58 బంతుల్లో తన ఐపీఎల్ కెరీర్‌లో తొమ్మిదో శతకాన్ని నమోదు చేశాడు. మొత్తంగా 60 బంతుల్లో 105 పరుగులతో అజేయంగా నిలిచిన కోహ్లీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. అతడి క్లాస్ ఇన్నింగ్స్ కారణంగా బెంగళూరు 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. అతడు ఇప్పటివరకు 279 మ్యాచ్‌లు ఆడగా, మహేంద్రసింగ్ ధోని, రోహిత్ శర్మ 278 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే ఐపీఎల్‌లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. అతడి ఖాతాలో ఇప్పుడు తొమ్మిది సెంచరీలు ఉండగా, జోస్ బట్లర్ ఏడు శతకాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

Tags

Next Story