IPL: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గెలిచిన "లఖ్‌"నవూ

IPL: ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గెలిచిన లఖ్‌నవూ
X
చివరి బంతి వరకూ సాగిన ఉత్కంఠ...లఖ్‌నవూను గెలిపించిన ముకుల్ చౌదరీ.. కోల్‌కతాను వెంటాడిన మరో ఓటమి

ఐపీ­ఎ­ల్ 2026లో మరో ఉత్కం­ఠ­భ­రి­త­మైన మ్యా­చ్‌­లో లఖ్‌­న­వూ అద్భుత వి­జ­యా­న్ని నమో­దు చే­సిం­ది. కో­ల్‌­క­తా నైట్ రై­డ­ర్స్‌­తో జరి­గిన ఈ పో­రు­లో లఖ్‌­న­వూ జట్టు చి­వ­రి వరకూ పో­రా­డి 3 వి­కె­ట్ల తే­డా­తో లక్ష్యా­న్ని చే­రు­కుం­ది. మ్యా­చ్ మొ­త్తం ప్రే­క్ష­కు­ల­ను కు­ర్చీ­ల­కు కట్టే­సే­లా సా­గిం­ది. మొదట బ్యా­టిం­గ్ చే­సిన కో­ల్‌­క­తా నై­ట్‌­రై­డ­ర్స్ ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 4 వి­కె­ట్ల నష్టా­ని­కి 181 పరు­గు­లు చే­సిం­ది. జట్టు ప్రా­రం­భం స్థి­రం­గా సా­గిం­ది. కె­ప్టె­న్ అజిం­క్యా రహా­నే మరో­సా­రి తన అను­భ­వా­న్ని ప్ర­ద­ర్శి­స్తూ 24 బం­తు­ల్లో 41 పరు­గు­లు సా­ధిం­చా­డు. అతని ఇన్నిం­గ్స్‌­లో 4 ఫో­ర్లు, 2 సి­క్స్‌­లు ఉన్నా­యి. అత­ని­కి మంచి మద్ద­తు అం­దిం­చిన యువ బ్యా­ట­ర్ రఘు­వం­శీ 33 బం­తు­ల్లో 45 పరు­గు­లు చేసి ఆక­ట్టు­కు­న్నా­డు. మధ్య ఓవ­ర్ల­లో గ్రీ­న్ 32 పరు­గు­ల­తో స్థి­రం­గా ఆడగా, పా­వె­ల్ చి­వ­ర్లో వే­గం­గా ఆడు­తూ 39 పరు­గు­లు చేసి స్కో­రు వే­గా­న్ని పెం­చా­డు. దీం­తో కో­ల్‌­క­తా జట్టు మంచి స్కో­రు నమో­దు చే­సిం­ది. అయి­తే భారీ స్కో­రు కా­క­పో­యి­నా పో­టీ­గా ని­లి­చే లక్ష్యా­న్ని మా­త్రం సెట్ చే­సిం­ది.

లఖ్‌­న­వూ బౌ­ల­ర్ల­లో ప్రి­న్స్ యా­ద­వ్, మణి­మా­ర­న్ సి­ద్ధా­ర్థ్, ది­గ్వే­శ్ రాఠీ, ఆవే­శ్‌ ఖాన్ ఒక్కో వి­కె­ట్ పడ­గొ­ట్టి ని­యం­త్ర­ణ­లో ఉంచే ప్ర­య­త్నం చే­శా­రు. అయి­న­ప్ప­టి­కీ చి­వ­రి ఓవ­ర్ల­లో కో­ల్‌­క­తా బ్యా­ట­ర్లు వే­గం­గా పరు­గు­లు చే­య­డం­తో స్కో­రు 180 దా­టిం­ది. 182 పరు­గుల లక్ష్యం­తో బరి­లో­కి ది­గిన లఖ్‌­న­వూ జట్టు ప్రా­రం­భం­లో కొంత ఒత్తి­డి­ని ఎదు­ర్కొం­ది. టాప్ ఆర్డ­ర్ ఎక్కు­వ­గా ని­ల­బ­డ­లే­క­పో­యిం­ది. ఒక దశలో 128 పరు­గు­ల­కే 7 వి­కె­ట్లు కో­ల్పో­యి జట్టు కష్టా­ల్లో పడిం­ది. మ్యా­చ్ పూ­ర్తి­గా కో­ల్‌­క­తా వైపు మళ్లి­న­ట్లే కని­పిం­చిం­ది. అయి­తే ఆ సమ­యం­లో బదో­నీ అద్భు­తం­గా ఆడు­తూ జట్టు­ను ని­ల­బె­ట్టా­డు. అతను 34 బం­తు­ల్లో 54 పరు­గు­లు చేసి కీలక పా­త్ర పో­షిం­చా­డు. 7 ఫో­ర్లు, 2 సి­క్స్‌­ల­తో అతని ఇన్నిం­గ్స్ ఆక­ట్టు­కుం­ది. కానీ మ్యా­చ్‌­ను పూ­ర్తి­గా మలు­పు తి మరో బ్యా­ట­ర్ ము­కు­ల్ చౌ­ద­రి అద్భుత ప్ర­ద­ర్శ­నే. చివరి వరకు క్రీజులో నిలిచిన ముకుల్ చౌదరి 27 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి మ్యాచ్‌ను లఖ్‌నవూ వైపు తిప్పాడు.

చివరి ఓవర్లో ఉత్కంఠ

ఆఖరి ఓవ­ర్‌­లో లఖ్‌­న­వూ­కు 14 పరు­గు­లు అవ­స­ర­మ­య్యా­యి. మొ­ద­టి బం­తి­కి ఆవే­శ్ ఖాన్ సిం­గి­ల్ తీసి స్ట్రై­క్ ము­కు­ల్‌­కు ఇచ్చా­డు. రెం­డో బం­తి­కి ము­కు­ల్ భారీ సి­క్స్ బా­ద­డం­తో మ్యా­చ్ మళ్లీ ఉత్కం­ఠ­గా మా­రిం­ది. ఆ తర్వా­తి రెం­డు బం­తు­ల్లో పరు­గు­లు రా­క­పో­వ­డం­తో ఒత్తి­డి పె­రి­గిం­ది. చి­వ­రి రెం­డు బం­తు­ల­కు 7 పరు­గు­లు అవ­స­ర­మ­య్యా­యి. ఐదో బం­తి­కి ము­కు­ల్ మరో సి­క్స్ కొ­ట్టి స్కో­రు సమం చే­శా­డు. చి­వ­రి బం­తి­కి అతను షాట్ మిస్ చే­సి­న­ప్ప­టి­కీ, బై రూ­పం­లో ఒక పరు­గు రా­వ­డం­తో లఖ్‌­న­వూ వి­జ­యా­న్ని అం­దు­కుం­ది. ఈ ము­గిం­పు మ్యా­చ్‌­ను మరింత రస­వ­త్త­రం­గా మా­ర్చిం­ది.

పోరాడినా తప్పని ఓటమి

కో­ల్‌­క­తా బౌ­ల­ర్ల­లో వై­భ­వ్ అరో­రా, అను­కు­ల్ రాయ్ తలో రెం­డు వి­కె­ట్లు తీసి మె­రు­గైన ప్ర­ద­ర్శన చే­శా­రు. అలా­గే సు­నీ­ల్ నరై­న్ కా­ర్తి­క్ త్యా­గి, కా­మె­రూ­న్ గ్రీ­న్ ఒక్కో వి­కె­ట్ సా­ధిం­చా­రు. అయి­న­ప్ప­టి­కీ చి­వ­రి ఓవ­ర్ల­లో మ్యా­చ్‌­ను కట్ట­డి చే­య­లే­క­పో­యా­రు. ఈ ఓట­మి­తో కో­ల్‌­క­తా నై­ట్‌­రై­డ­ర్స్‌­కు ఇది నా­లు­గు మ్యా­చ్‌­ల­లో మూడో పరా­జ­యం అయిం­ది. ఒక మ్యా­చ్ వర్షం కా­ర­ణం­గా రద్దు కా­వ­డం­తో వా­రి­కి ఒక్క పా­యిం­ట్ మా­త్ర­మే లభిం­చిం­ది. మరో­వై­పు లఖ్‌­న­వూ ఈ వి­జ­యం­తో తమ ఆత్మ­వి­శ్వా­సా­న్ని పెం­చు­కుం­ది. మొ­త్తా­ని­కి ఈ మ్యా­చ్ ఐపీ­ఎ­ల్ 2026లో అత్యంత ఉత్కం­ఠ­భ­రిత పో­రా­టా­ల్లో ఒక­టి­గా ని­లి­చిం­ది. చి­వ­రి బంతి వరకు ఫలి­తం తె­లి­య­ని ఈ పోరు ప్రే­క్ష­కు­ల­కు అస­లైన క్రి­కె­ట్ మజా­ను అం­దిం­చిం­ది.

Tags

Next Story