IPL: 100 వికెట్ల క్లబ్‌లో సిరాజ్‌ మియా

IPL: 100 వికెట్ల క్లబ్‌లో సిరాజ్‌ మియా
X
ఐపీఎల్‌లో హైదరాబాదీ సత్తా..

హైదరాబాదీ పేసర్ సిరాజ్ మియా సత్తా చాటాడు. ఐపీఎల్లో వంద వికెట్ల‌ను పూర్తి చేసుకున్నాడు. ఆదివారం గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో అభిషేక్ శ‌ర్మ‌ను ఔట్ చేయ‌డం ద్వారా ఈ మైలురాని చేరుకున్నాడు. కెరీర్ లో 97వ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్.. రెండు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అంత‌గా బౌన్స్ లేని ఈ పిచ్ పై స్టంప్ లైన్ పై బౌలింగ్ చేసి, మంచి ఫ‌లితాన్ని రాబ‌ట్టాడు. బ్లాక్ సాయిల్ పిచ్ పై అంత‌గా బౌన్స్ లేక‌పోవ‌డం, డ్రై పిచ్ ఉండ‌టం ఫాయిదా పొందాడు. ప్రారంభం ఓవ‌ర్ల‌లో ట్రావిస్ హెడ్ ను బోల్తా కొట్టించి, గుజరాత్ కు జోష్ నిచ్చాడు. ఆ త‌ర్వాత జోరుమీదున్న అభిషేక్ శ‌ర్మ‌ను డిసీవ్ చేసి, మంచి బంతితో బోల్తా కొట్టించాడు. ఊరించే బంతిని వేసి, మిడాఫ్ లో క్యాచౌట్ చేశాడు.

ప్రతీకారం తీర్చుకున్న సిరాజ్

క్రికెట్‌లో రైవల్రీలకు కొదువ లేదు. కొన్ని పోరాటాలు మాత్రం బాగా హైలైట్ అవుతుంటాయి. అలాంటిదే మహ్మద్ సిరాజ్-ట్రావిస్ హెడ్ రైవల్రీ. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఈ ఇద్దరూ తలపడిన ప్రతిసారి ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. అయితే మియాను హెడ్ బాదేయడం లేదా కంగారూ స్టార్‌ను సిరాజ్ పెవిలియన్‌కు పంపించడమో జరుగుతూ ఉంటుంది. అలాగే ఎదురుపడినప్పుడు తిట్ల పురాణం అందుకోవడం, పైపైకి దూసుకెళ్లడం కూడా చూస్తూనే ఉంటాం. వీళ్ల రైవల్రీ ఐపీఎల్ తాజా ఎడిషన్‌లోనూ కంటిన్యూ అవుతోంది. అయితే ఈసారి సిరాజ్ దాదాగిరి చూపించాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ దూకుడుగా బౌలింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బంతికి ట్రావిస్ హెడ్ (9)ను ఔట్ చేశాడు సిరాజ్. 2 బౌండరీలు కొట్టిన స్టార్ బ్యాటర్.. మియాపై పైచేయి సాధించినట్లే కనిపించాడు. కానీ మంచి బంతితో అతడి పనిపట్టాడు సిరాజ్. ఆ తర్వాత వరుస బౌండరీలతో దూకుడు మీద ఉన్న అభిషేక్ శర్మ (18)ను వెనక్కి పంపించాడు. ఇలా ఆదిలోనే ఆరెంజ్ ఆర్మీ జోరుకు బ్రేకులు వేశాడు. ముఖ్యంగా హెడ్‌ను పంపడం ఎస్‌ఆర్‌హెచ్‌కు బిగ్ మైనస్‌గా మారింది. నెటిజన్స్.. హెడ్‌ మీద మియా పగ తీర్చుకున్నాడని, ఇది ఐపీఎల్‌కు మించిన రైవల్రీ అని కామెంట్స్ చేస్తున్నారు.

పడిలేచిన కెర‌టం..

ఈ సీజ‌న్ లో సిరాజ్ కు శుభారంభం ద‌క్క‌లేదు. పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన తొలి మ్యాచ్ లో మియా భాయ్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. ఆ మ్యాచ్ లో భారీగా 54 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న సిరాజ్.. వికెట్లేమీ తీయ‌లేదు. అయితే ఆ త‌ర్వాత త‌న అనుభ‌వ‌న్నంతా రంగ‌రించుకున్నాడు. సొంత‌గ‌డ్డ అహ్మ‌దాబాద్ న‌రేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో జులూ విదిల్చాడు.

Tags

Next Story