IPL: లక్నోకు పంత్ గుడ్‌బై.. రిషబ్ రియాక్షన్

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్‌లో దారుణంగా నిరాశపరిచాడు. 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 135 రన్సే చేశాడు. కెప్టెన్‌గానూ లక్నోను ప్లే ఆఫ్స్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు. దీంతో వచ్చే సీజన్‌కు లక్నో ఫ్రాంచైజీ అతన్ని రిలీజ్ చేస్తుందన్న వార్తలు వచ్చాయి. దీనిపై పంత్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఆ వార్తలను కొట్టిపారేశాడు. సెన్సిబుల్‌గా ఉండాలని మీడియాను కోరాడు. ఏజెండాతో కావాలని వార్తలను సృష్టించొద్దన్నాడు. ‘ఫేక్ న్యూస్ ఎక్కువగా ప్రచారం జరుగుతుందని నాకు తెలుసు. కానీ, దాని చుట్టే అన్ని ఉండకూదు. ఏజెండాతో కావాలని వార్తలను సృష్టించొద్దు. కాస్త తెలివిగా ఉండండి. విశ్వసనీయ వార్తలు ఇవ్వండి. సోషల్ మీడియాలో కూడా బాధ్యతతో సెన్సిబుల్‌గా పోస్టులు పెట్టండి.’ అని పంత్ రాసుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com