IPL: సన్‌రైజర్స్ పరాజయాల పరంపర

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ బ్యాటర్లు తేలిపోయారు. లోకల్ భాయ్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి(34 బంతుల్లో 3 ఫోర్లతో 31), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 27) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ప్యాట్ కమిన్స్(9 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(4/17) నాలుగు వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించాడు. ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ రెండేసి వికెట్లు తీశాడు.
మరీ ఇంత నిర్లక్ష్యమా...
సన్ రైజర్స్ బలానికి విరుద్ధంగా స్లో వికెట్ ను ఈ మ్యాచ్ కు సిద్ధం చేశారు. ఈ క్రమంలో పరుగులు చేయడానికి బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ (8), అభిషేక్ శర్మ (18), ఇషాన్ కిషన్ (17) వికెట్లను కోల్పోవడంతో ఓ దశలో 50/3 తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో హెన్రిచ్ క్లాసెన్ (27) తో కలిసి నితీశ్ కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరూ 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివర్లో అనికేత్ వర్మ (18), పాట్ కమిన్స్ (22 నాటౌట్) తో వేగంగా ఆడటంతో సన్ రైజర్స్ సవాలు విసరగలిగే స్కోరు సాధించింది. బౌలర్లలో ప్రసిధ్ , సాయి కిశోర్ కు రెండేసి వికెట్లు దక్కాయి. బ్యాటింగ్‌కు వచ్చిన హెన్రీచ్ క్లాసెన్(27) దూకుడుగా ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సిరాజ్ (4/17) దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులే చేయగలిగింది.
ఆరంభంలో తడబడినా..
సాయి సుదర్శన్ (5), జోస్ బట్లర్ (0) త్వరగానే నిష్క్రమించినా.. గిల్, సుందర్ జట్టును విజయం దిశగా నడిపించారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. శుభ్‌మన్ నిలకడగా ఆడగా.. మరో ఎండ్‌లో సుందర్ చెలరేగిపోయాడు. సుందర్ (29 బంతుల్లో 49, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. సిమర్జిత్ సింగ్ బౌలింగ్ లో 20 పరగులు సాధించడంతో గుజరాత్ ముమెంటంను సాధించింది.రూథర్ ఫర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్సర్) ధనాధన్ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. అతని తో కలిసి గుజరాత్ ను మరో 20 బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు గిల్ చేర్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com