IPL: భారీ లక్ష్యాన్ని ఊదేసిన సన్‌రైజర్స్

IPL: భారీ లక్ష్యాన్ని ఊదేసిన సన్‌రైజర్స్
X
ముంబైపై హైదరాబాద్ ఘన విజయం... సన్ రైజర్స్‌‌‌‌కు వరుసగా ఐదో గెలుపు... కొనసాగుతున్న ముంబై ఓటములు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెచ్చిపోయింది. 6 వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్‌ను మట్టికరిపించింది. రికెల్టన్‌ (123 నాటౌట్‌; 55 బంతుల్లో 10×4, 8×6) మెరుపు శతకం బాదడంతో మొదట ముంబయి 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. విల్‌ జాక్స్‌ (46; 22 బంతుల్లో 5×4, 3×6) సత్తా చాటాడు. ఇషాన్‌ మలింగ (1/29) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. హెడ్‌ (76; 30 బంతుల్లో 4×4, 8×6), క్లాసెన్‌ (65 నాటౌట్‌; 30 బంతుల్లో 7×4, 4×6), అభిషేక్‌ శర్మ (45; 24 బంతుల్లో 4×4, 3×6) చెలరేగడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్‌ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బుమ్రా బంతితో విఫలమయ్యాడు. 4 ఓవర్లలో 54 పరుగులిచ్చి, ఒక్క వికెట్టూ పడగొట్టలేకపోయాడు. ఓపెనర్‌ ర్యాన్‌ రికెల్టన్‌ అద్భుత శతకంతో జట్టుకు పునాది వేశాడు. అతడు చివరి వరకూ అవుట్‌ కాకుండా నిలిచి 123 పరుగులతో మెరిపించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. ప్రారంభంలోనే విల్‌ జాక్స్‌తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పిన రికెల్టన్‌ ముంబై స్కోరును వేగంగా ముందుకు నడిపించాడు. జాక్స్‌ 46 పరుగులతో మంచి మద్దతు ఇచ్చాడు. మధ్యలో సూర్యకుమార్‌ యాదవ్‌, నమన్‌ ధీర్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, హార్దిక్‌ పాండ్యా వేగంగా 31 పరుగులు జోడించాడు. తిలక్‌ వర్మ, రాబిన్‌ మింజ్‌ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ రికెల్టన్‌ దూకుడుతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హింగే రెండు వికెట్లు తీయగా, మలింగ, నితీశ్‌, సాకిబ్‌ ఒక్కో వికెట్‌ సాధించారు.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ భారీ స్కోర్‌ చేసింది. ర్యాన్‌ రికెల్టన్‌ (123 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. మిగతా బ్యాటర్లలో విల్‌ జాక్స్‌ 46, సూర్యకుమార్‌ యాదవ్‌ 5, నమన్‌ ధిర్‌ 22, హార్దిక్‌ పాండ్యా 31, తిలక్‌ వర్మ 7, రాబిన్‌ మింజ్‌ 1 (నాటౌట్‌) పరుగు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో హింగే 2, ఎషాన్‌ మలింగ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, సాకిబ్‌ తలో వికెట్‌ తీశారు. అయితే ఈ భారీ లక్ష్యం సన్‌రైజర్స్‌కు పెద్ద సవాలుగా అనిపించలేదు. ఛేదన ప్రారంభం నుంచే హైదరాబాద్‌ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ట్రవిస్‌ హెడ్‌ అద్భుత ఆరంభం ఇచ్చారు. బౌండరీలు, సిక్సర్లతో ముంబై బౌలర్లపై విరుచుకుపడి మొదటి ఎనిమిది ఓవర్లకే జట్టును 126 పరుగుల దాకా తీసుకెళ్లారు. హెడ్‌ కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేయడం మ్యాచ్‌ మలుపు తిప్పింది.

అభిషేక్‌ 45 పరుగులు చేసి అవుట్‌ కాగా, ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తరువాత ముంబై బౌలర్లు కొంతసేపు పట్టు సాధించినట్టు కనిపించింది. వరుసగా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను ఆసక్తికరంగా మార్చారు. అయితే హెడ్‌ 76 పరుగుల ఇన్నింగ్స్‌తో ఇప్పటికే బలమైన పునాది వేసి వెళ్లాడు. అభిషేక్‌ 45 పరుగులు చేసి అవుట్‌ కాగా, ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు హెడ్‌ 76 పరుగుల ఇన్నింగ్స్‌తో ఇప్పటికే బలమైన పునాది వేసి వెళ్లాడు. ఈ దశలో హెన్రిచ్‌ క్లాసెన్‌ బాధ్యత తీసుకున్నాడు. అతడు తనదైన శైలిలో దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.

Tags

Next Story