IPL: ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఖరారు..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 సీజన్‌కు సంబంధించిన మినీ వేలానికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 13-15 మధ్య వేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నవంబర్ 15వ తేదీలోపు 10 జట్లు తమ రిటెన్షన్ జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. ఐపీఎల్ వేలం జరిగే వేదికతో పాటు తేదీలపై బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. గత రెండు సీజన్లకు సంబంధించిన వేలం విదేశాల్లో జరగ్గా.. ఈసారి స్వదేశంలో నిర్వహించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం మెగా వేలం నిర్వహించగా.. జట్లన్నీ పూర్తిగా మారిపోయాయి. మినీవేలంలో భారీ మార్పులు ఉండకపోయినా.. అవసరం లేని ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు వదిలేసే అవకాశం ఉంది.
రిటెన్షన్‌కు ఇదే డెడ్‌లైన్..!
అన్ని ఫ్రాంచైజీలు నవంబర్ 15లోగా తమ రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. విడుదల చేయబోయే ఆటగాళ్ల పేర్లను అంతకుముందే ఖరారు చేయాలి.
ఈసారి వేలం భారత్‌లోనే..?
గత రెండు సీజన్లలో (2023 దుబాయ్, 2024 జెడ్డా) విదేశాల్లో జరిగిన వేలం, ఈసారి భారత్‌లోనే జరిగే అవకాశముంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. గత రెండు సీజన్ల వేలం విదేశాల్లో జరగ్గా.. ఈసారి స్వదేశంలో నిర్వహించనున్నారు.
సీఎస్కే, రాజస్థాన్ లో భారీ మార్పులు?
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్తాన్ రాయల్స్ (RR) గత సీజన్లో అట్టడుగు స్థానాల్లో ముగించడంతో వచ్చే సీజన్‌కు ముందు భారీ మార్పులకు ఆస్కారముంటుంది. మరోవైపు, గత సీజన్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ఈ వేలం కీలకంగా మారింది. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంతో చెన్నై పర్సులో భారీగా డబ్బు చేరనుంది. దీంతో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు సీఎస్కేకు మంచి అవకాశం లభించింది. ఇక రాజస్థాన్ రాయల్స్ తమ కెప్టెన్ సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ ద్వారా మరో జట్టుకు పంపే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆ జట్టు తొలి టైటిల్‌ను అందుకుంది. కానీ ఆ సంబరం కాస్త 24 గంటల వ్యవధిలోనే విషాదంగా మారింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట చోటు చేసుకొని 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గత సీజన్లో ఫాఫ్ డుప్లెసిస్‌ను వదులుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రజత్ పాటిదార్ కెప్టెన్సీలో తొలిసారి టైటిల్‌ను ముద్దాడింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ, తమ జట్టును మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ వేలంపై దృష్టి సారించనుంది. కేకేఆర్ రూ.23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన వెంకటేశ్ అయ్యర్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com