ipl: సామాన్యులకు దూరంగా ఐపీఎల్ టికెట్లు

ipl: సామాన్యులకు దూరంగా ఐపీఎల్ టికెట్లు
X
సీఎస్కే మ్యాచ్ టికెట్లు క్షణాల్లోనే మాయం... టికెట్ ధరలను రెట్టింపు చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. బాగా సొమ్ము చేసుకుంటున్న సన్ రైజర్స్

హై­ద­రా­బా­ద్‌­లో­ని ఉప్ప­ల్ స్టే­డి­యం మరో­సా­రి ఐపీ­ఎ­ల్ సం­ద­డి­తో కళ­క­ళ­లా­డు­తోం­ది. ము­ఖ్యం­గా చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ మ్యా­చ్‌­ల­కు ఎప్ప­టి­లా­గే భారీ ఆదరణ కని­పి­స్తు­న్నా, ఈసా­రి టి­క్కె­ట్ల వ్య­వ­హా­రం అభి­మా­ను­ల్లో తీ­వ్ర అసం­తృ­ప్తి­కి దారి తీ­సిం­ది. మహేం­ద్ర సిం­గ్ ధో­నీ­ని ప్ర­త్య­క్షం­గా చూ­డా­ల­నే ఆస­క్తి­తో వే­లా­ది మంది అభి­మా­ను­లు ఎదు­రు­చూ­స్తుం­డ­గా, టి­క్కె­ట్ల ధరలు భా­రీ­గా పె­ర­గ­డం, అలా­గే క్ష­ణా­ల్లో­నే ‘సో­ల్డ్ అవు­ట్’ అవు­తు­న్న పరి­స్థి­తు­లు తీ­వ్ర చర్చ­నీ­యాం­శం­గా మా­రా­యి. సన్ రై­జ­ర్స్ హై­ద­రా­బా­ద్ ని­ర్వ­హ­ణ­లో ఉన్న ఈ మ్యా­చ్‌­కు సం­బం­ధిం­చి టి­క్కె­ట్ ధరలు గతం­తో పో­లి­స్తే గణ­నీ­యం­గా పె­రి­గా­యి. సా­ధా­ర­ణం­గా మధ్య­త­ర­గ­తి అభి­మా­ను­లు కొ­ను­గో­లు చేసే సౌత్ ఈస్ట్, వె­స్ట్ టె­ర్ర­స్ టి­క్కె­ట్లు గతం­లో రూ.1250గా ఉం­డ­గా, ఈసా­రి అవి నే­రు­గా రూ.2500కు పెం­చ­డం అభి­మా­ను­ల­ను ని­రా­శ­కు గు­రి­చే­సిం­ది. ఇదే వి­ధం­గా ఈస్ట్, వె­స్ట్ ఫస్ట్ ఫ్లో­ర్ టి­క్కె­ట్ల ధర­ల­ను రూ.2250 నుం­చి రూ.3500కు పెం­చ­గా, కా­ర్పొ­రే­ట్ బా­క్సుల ధరలు రూ.23 వేల నుం­చి రూ.33 వేల వరకు పె­ర­గ­డం ఆశ్చ­ర్యా­ని­కి గు­రి­చే­సిం­ది. టి­క్కె­ట్ ధర­ల­పై అద­నం­గా బు­కిం­గ్ చా­ర్జీ­లు కూడా రూ.300 నుం­చి రూ.2000 వరకు వసూ­లు చే­య­డం మరింత భా­రం­గా మా­రిం­ది.

ము­ఖ్యం­గా చె­న్నై మ్యా­చ్ కా­వ­డం­తో డి­మాం­డ్ పె­రి­గి­న­ప్ప­టి­కీ, ధర­ల­ను ఇం­త­గా పెం­చ­డం­పై అభి­మా­ను­లు తీ­వ్ర అస­హ­నం వ్య­క్తం చే­స్తు­న్నా­రు. ధోనీ ఆటను ఒక­సా­రి అయి­నా ప్ర­త్య­క్షం­గా చూ­డా­ల­న్న కో­రి­క­తో టి­క్కె­ట్లు కొ­ను­గో­లు చే­యా­ల­ని యా­ప్‌­ల­లో ప్ర­య­త్నిం­చే సరి­కి భారీ క్యూ లై­న్లు కని­పిం­చ­డం, చి­వ­రి­కి క్ష­ణా­ల్లో­నే టి­క్కె­ట్లు అయి­పో­యి­న­ట్లు చూ­పిం­చ­డం అభి­మా­ను­ల్లో అను­మా­నా­ల­కు దా­రి­తీ­సిం­ది. చా­లా­మం­ది యాప్ ఓపె­న్ చే­సిన వెం­ట­నే “సో­ల్డ్ అవు­ట్” సం­దే­శం కని­పిం­చిం­ద­ని చె­బు­తు­న్నా­రు. టి­క్కె­ట్ల వి­క్రయ ప్ర­క్రి­య­లో పా­ర­ద­ర్శ­కత లే­ద­నే ఆరో­ప­ణ­లు కూడా వి­ని­పి­స్తు­న్నా­యి. మ్యా­చ్‌­కు ముం­దు ఇతర జట్లు సా­ధా­ర­ణం­గా టి­క్కె­ట్ల ధరలు, అం­దు­బా­టు­లో ఉన్న సీ­ట్ల వి­వ­రా­ల­ను ముం­దు­గా­నే వె­ల్ల­డి­స్తుం­టే, ఈ వి­ష­యం­లో ఎస్‌­ఆ­ర్‌­హె­చ్ మా­త్రం స్ప­ష్ట­మైన సమా­చా­రం ఇవ్వ­లే­ద­ని అభి­మా­ను­లు వి­మ­ర్శి­స్తు­న్నా­రు. టి­క్కె­ట్ల­లో పె­ద్ద భా­గా­న్ని యా­ప్‌­లో అం­దు­బా­టు­లో ఉం­చ­కుం­డా, కాం­ప్లి­మెం­ట­రీ పా­స్‌­లు లేదా సి­ఫా­ర్సుల ద్వా­రా వి­క్ర­యి­స్తు­న్నా­ర­నే ఆరో­ప­ణ­లు వి­ని­పి­స్తు­న్నా­యి.

ఇది కేవలం ధరల పెంపు సమస్య మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకుడికి మ్యాచ్ చూడడం కష్టమవుతోందనే భావనను కూడా కలిగిస్తోంది. క్రికెట్‌పై అపారమైన అభిమానం కలిగిన తెలుగు రాష్ట్రాల అభిమానులు తమ ఇష్టమైన జట్టును, ఇష్టమైన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూడాలనుకుంటే అధిక ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఐపీఎల్ క్రమంగా సామాన్య ప్రజలకు అందని దూరంగా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక ధోనీ ప్రభావం కూడా టిక్కెట్ డిమాండ్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ధోనీ మ్యాచ్ అంటే స్టేడియంలో ప్రత్యేక వాతావరణం ఉండడం సహజం. అతని చివరి దశ కెరీర్ నేపథ్యంలో ప్రతి మ్యాచ్‌కు డిమాండ్ మరింత పెరుగుతోంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకుని టిక్కెట్ ధరలను రెట్టింపు చేయడం సరైంది కాదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికల్లో కూడా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టిక్కెట్ ధరల పెంపుతో పాటు, విక్రయ విధానంపై కూడా వివరణ ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్ని టిక్కెట్లు అమ్మారు, ఎన్ని కాంప్లిమెంటరీ పాస్‌లుగా ఇచ్చారు అనే వివరాలను బహిరంగంగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇలాంటి వ్యవహారాలు అభిమానుల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.

Tags

Next Story