IPL: పాయింట్ల పట్టికలో టాప్‌లో బెంగళూరు

ఐపీఎల్ 2025 సీజన్ పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. శనివారం ముంబై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ముంబై జట్టు వారి మొదటి రెండు మ్యాచ్‌లలో ఓటమి కారణంగా పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది. దీంతో బెంగళూరు మొదటి స్థానానికి ఎగబాకింది. లక్నో, గుజరాత్, పంజాబ్, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కత్తా, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సారి మ్యాచ్‌లు ఉత్కంఠగా జరుగుతున్నాయి.
ఐపీఎల్‌లో నేడు డబుల్ ధమాకా
ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. విశాఖపట్నం వేదికగా మధ్యాహ్నం 3:30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిచి మరొకటి ఓడిన సన్‌రైజర్స్ మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలతో ఉంది. అలాగే గువాహటి వేదికగా సాయంత్రం 7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడనున్నాయి. ఈ మ్యాచులో గెలిచి బొణీ కొట్టాలని రాజస్థాన్ చూస్తోంది.
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ
MI మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో 450* మ్యాచ్‌లు ఆడిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. IPL 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌తో రోహిత్ శర్మ ఈ ఫీట్ అందుకున్నాడు. భారత్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన జాబితాలో రోహిత్ శర్మ తర్వాత దినేశ్ కార్తీక్(412), విరాట్ కోహ్లీ(401*), మహేంద్ర సింగ్ ధోనీ(393*), సురేశ్ రైనా(336) ఉన్నారు.
MI ఓటమి.. పాండ్యా ఏమన్నాడంటే?
MI ఓటమిపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యంతో పాటు చెత్త ఫీల్డింగ్ కారణంగా తాము ఓటమి పాలయ్యామన్నాడు. GT ఓపెనర్లు అద్బుతంగా బ్యాటింగ్ చేశారన్న పాండ్యా.. మైదానంలో తాము ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేదని చెప్పుకొచ్చాడు. తాము మెరుగ్గా రాణించే ప్రయత్నం చేశామని, కానీ విజయాన్ని అందుకోలేకపోయామన్నాడు. అయితే, పాండ్యా కూడా చాలా జిడ్డుగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com