RINKU: ఎంపీ ప్రియ సరోజ్‌తో రింకు పెళ్లి?

RINKU: ఎంపీ ప్రియ సరోజ్‌తో రింకు పెళ్లి?
X
ఈ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని జోరుగా ప్రచారం... పార్లమెంట్ భేటీ తర్వాతే పెళ్లి

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియ సరోజ్‌ను టీం ఇండియా క్రికెటర్‌ రింకు సింగ్‌ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మొదట ఈ ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ప్రియ తండ్రి తుఫాని సరోజ్‌ దీన్ని ఖండించారు. రింకు కుటుంబ సభ్యులు పెళ్లి ప్రతిపాదన తెచ్చారని, ఇంకా చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కాగా, యూపీలో మచ్చలి షహర్‌ నుంచి ఎంపీగా ప్రియ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

లక్నోలో నిశ్చితార్థం

ప్రియ సరోజ్‌- రింకు సింగ్‌ నిశ్చితార్థం లక్నోలో జరుగుతుందని తెలుస్తోంది. అయితే, రింకు సింగ్‌, ప్రియా నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన వార్తలు తుఫానీ సరోజ్‌ కొట్టిపడేశారు. సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఇంకా ఇద్దరి నిశ్చితార్థం జరుగలేదని చెప్పారు. గురువారం రింకు కుటుంబాన్ని అలీగఢ్‌లో కలిసినట్లు పేర్కొన్నారు. వివాహం విషయంలో చర్చలు అర్థవంతంగా జరిగాయన్నారు.

పార్లమెంట్ భేటీ తర్వాతే..

పార్లమెంట్‌ సమావేశాల జనవరి నెలాఖరు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతాయన్నారు. ఈ సమావేశాలు ముగిసిన తర్వాత నిశ్చితార్థం, వివాహ తేదీలను నిర్ణయించున్నట్లు తెలిపారు. ఇక రింకు సింగ్‌ ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొననున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్‌ జరుగబోతుంది. ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. రూ.13కోట్లకు రింకు సింగ్‌ను కేకేఆర్‌ కొనుగోలు చేసింది.

Tags

Next Story