ISHAN KISHAN: ఇ"షా‌న్‌దార్"..టీమిండియా నయా స్టార్

ISHAN KISHAN: ఇషా‌న్‌దార్..టీమిండియా నయా స్టార్
X
టీమిండియాకు అనుకోని హీరో.... అనూహ్యంగా జట్టులోకి ఇషాన్.. అంచనాలను మించి రాణింపు

భా­ర­త్–పా­కి­స్థా­న్ మ్యా­చ్ అం­టే­నే ఉత్కంఠ, ఒత్తి­డి, భా­వో­ద్వే­గాల తు­ఫా­ను. అలాం­టి పో­రు­లో అం­చ­నా­లు అంతా ఒక­రి­పై ఉం­డ­గా, మరో ఆట­గా­డు మె­రు­పు­వే­గం­తో రం­గం­లో­కి దిగి మ్యా­చ్‌­ను తల­కిం­దు­లు చే­య­డం అరు­దైన సం­ఘ­టన. కొ­లం­బో వే­ది­క­గా జరి­గిన ఐసీ­సీ టీ20 ప్ర­పం­చ­క­ప్ 2026 మ్యా­చ్‌­లో అదే జరి­గిం­ది. భారీ అం­చ­నా­లు లే­కుం­డా­నే క్రీ­జు­లో­కి ది­గిన ఇషా­న్ కి­ష­న్ తన వి­ధ్వం­స­కర ఇన్నిం­గ్స్‌­తో భా­ర­త్‌­కు చా­రి­త్రా­త్మక వి­జ­యా­న్ని అం­దిం­చా­డు. ఈ ఇన్నిం­గ్స్ భారత అభి­మా­నుల మది­లో చాలా కాలం ని­లి­చి­పో­వ­డం ఖాయం. మ్యా­చ్‌­కు ముం­దు వరకూ భారత టీ20 జట్టు­లో ప్ర­ధాన ఆక­ర్ష­ణ­గా ఉన్న­ది అభి­షే­క్ శర్మ. పా­క్‌­పై కూడా అత­డి­పై­నే అం­ద­రి దృ­ష్టి. కానీ అతను డకౌ­ట్ కా­వ­డం­తో జట్టు ఒత్తి­డి­లో పడిం­ది. కొ­లం­బో పిచ్ స్వ­భా­వం బ్యా­టిం­గ్‌­కు సహ­క­రిం­చ­క­పో­వ­డం, స్పి­న్న­ర్ల­కు అధి­కం­గా అను­కూ­లిం­చ­డం పరి­స్థి­తి­ని మరింత క్లి­ష్టం చే­సిం­ది. ఇలాం­టి క్లి­ష్ట సమ­యం­లో ఇషా­న్ కి­ష­న్ క్రీ­జు­లో ని­ల­బ­డి ఆడిన ఇన్నిం­గ్స్ మ్యా­చ్ గమ­నా­న్ని పూ­ర్తి­గా మా­ర్చే­సిం­ది.

ఈ మ్యా­చ్‌­లో ఇషా­న్ ఒక్క­డే ఒక వైపు ని­లి­స్తే, మి­గ­తా బ్యా­ట­ర్లు మరో వైపు ఉన్న­ట్లే అని­పిం­చిం­ది. స్పి­న్‌­కు వి­ప­రీ­తం­గా సహ­క­రిం­చిన నె­మ్మ­దైన పి­చ్‌­పై బౌం­డ­రీ­లు సా­ధిం­చ­డం చాలా కష్ట­మైం­ది. అవు­ట్ ఫీ­ల్డ్ కూడా మం­ద­గిం­చ­డం­తో బలం­గా కొ­ట్టిన షా­ట్లు కూడా బౌం­డ­రీ­కి చే­ర­డం కష్టం­గా మా­రిం­ది. ఇషా­న్ తప్ప మరె­వ­రూ అర్ధ­శ­త­కం నమో­దు చే­య­లే­క­పో­యా­రు. 20 పరు­గు­లు దా­టిన బ్యా­ట­ర్ల­లో ఇషా­న్ స్ట్రై­క్ రేట్ 192.5 ఉం­డ­గా, శి­వ­మ్ దూబే మా­త్ర­మే 150 మా­ర్క్ దా­ట­గ­లి­గా­డు. దూ­కు­డు­గా ఆడే సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్ సైతం 29 బం­తు­ల్లో 110 స్ట్రై­క్ రే­ట్‌­కే పరి­మి­త­మ­య్యా­డు. తి­ల­క్ వర్మ కూడా స్పి­న్‌­ను ఎదు­ర్కొ­నే క్ర­మం­లో ఇబ్బం­ది పడ్డా­డు.

ఇషా­న్ మా­త్రం పరి­స్థి­తు­ల­కు భి­న్నం­గా ఆడా­డు. ప్ర­తి బం­తి­ని గమ­ని­స్తూ, అవ­కా­శ­మొ­స్తే దాడి చే­యా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­డు. కొ­న్ని సం­ద­ర్భా­ల్లో అతను గా­ల్లో­కి లే­పిన షా­ట్లు అభి­మా­ను­ల్లో ఆం­దో­ళన కలి­గిం­చి­నా, అదే ధై­ర్యం అత­ని­కి వి­జ­యా­న్ని అం­దిం­చిం­ది. స్పి­న్న­ర్ల­ను లక్ష్యం­గా చే­సు­కు­ని అడ్డ­ది­డ్డం­గా కా­కుం­డా లె­క్క­చే­సిన దా­డు­లు చే­శా­డు. గ్యా­ప్‌­ల­ను గు­ర్తిం­చి ఫో­ర్లు, సి­క్స­ర్లు సా­ధిం­చా­డు. అతను క్రీ­జు­లో ఉన్నం­త­సే­పు పిచ్ క్లి­ష్టత కని­పిం­చ­లే­దు. కానీ అతను ఔట్ అయిన తర్వాత మి­గ­తా బ్యా­ట­ర్ల తడ­బా­టు చూ­స్తే అతని ఇన్నిం­గ్స్ వి­లువ మరింత స్ప­ష్ట­మైం­ది. ఈ ఇన్నిం­గ్స్ లే­క­పో­తే మ్యా­చ్ ఏక­ప­క్షం­గా మారే అవ­కా­శం ఉం­డే­ది. రెం­డు జట్ల మధ్య తేడా ఇషా­న్ ఒక్క­రే అన్న­ట్టు­గా పరి­స్థి­తి మా­రిం­ది. చి­వ­రి­కి భా­ర­త్ 61 పరు­గుల తే­డా­తో పా­కి­స్థా­న్‌­ను ఓడిం­చిం­ది. బౌ­లిం­గ్ వి­భా­గం­లో జస్‌­ప్రీ­త్ బు­మ్రా, హా­ర్ది­క్ పాం­డ్యా అద్భుత ప్ర­ద­ర్శ­న­తో ప్ర­త్య­ర్థి­ని కట్ట­డి చే­శా­రు. అయి­తే వి­జ­యం కోసం పు­నా­ది వే­సిం­ది మా­త్రం ఇషా­న్ ఇన్నిం­గ్సే. ఆసక్తికర విషయం ఏమిటంటే, రెండు నెలల క్రితం వరకూ ఇషాన్ జాతీయ జట్టులో స్థానం కోసం పోరాడుతున్న ఆటగాడు మాత్రమే. రెండేళ్లకు పైగా ఏ ఫార్మాట్‌లోనూ భారత్ తరఫున ఆడని అతను టీ20 ప్రపంచకప్ జట్టులో ఉంటాడని ఎవరూ ఊహించలేదు. కానీ ముస్తాక్ అలీ టోర్నీలో మెరిసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఎంపికై, తర్వాత అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.

Tags

Next Story