Lara-Ishan: బ్రియాన్ లారా నాకు మెసేజ్ చేయడం మరిచిపోలేను: ఇషాన్ కిషన్

దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా, భారత యువ ఆటగాళ్లు శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్‌లతో ముచ్చటించాడు. 3వ వన్డే పూర్తయిన తర్వాత వీరిద్దరిని లారా ఇంటర్వూ చేశాడు. దీంతో వీరు ఉబ్బితబ్బివ్వడంతో పాటు లారాపై ప్రశంసలు కురిపించారు. అలాగే లారా వీరికి విలువైన సూచనలు అందించాడు.
ఈ వీడియోని బీసీసీఐ ఎక్స్‌లో షేర్ చేసింది. అందులో వారిద్దరూ లారాపై ప్రశంసలతో పాటు లారా నుంచి నేర్చుకున్న పాఠాలు, నైపుణ్యాలు వివరించారు.3వ వన్డేకి బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. బ్యాటింగ్‌కి అనుకూలించిన పిచ్‌పై 351 పరుగులు సాధించారు. 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
All ears when the 𝗣𝗿𝗶𝗻𝗰𝗲 𝗼𝗳 𝗧𝗿𝗶𝗻𝗶𝗱𝗮𝗱 speaks 🗣️
— BCCI (@BCCI) August 2, 2023
𝘿𝙊 𝙉𝙊𝙏 𝙈𝙄𝙎𝙎 - @BrianLara in conversation with @ShubmanGill & @ishankishan51 at the Brian Lara Stadium, Trinidad👌👌 - By @ameyatilak
Full Conversation - https://t.co/xWbvEz9kjU #WIvIND pic.twitter.com/AOLgonqyGE
ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. బ్రియాన్ లారా ఇంతకు ముందు ఓసారి ఇన్‌స్టాగ్రాంలో మెసేజ్ పంపించారన్న విషయాన్ని వెల్లడించాడు. అది తాను మరిచిపోలేనని వెల్లడించాడు.
"లారా గురించి చాలా కథలు విన్నాను. ముఖ్యంగా లారా లంచ్ సమయం వరకు బ్యాటింగ్ చేసి, మళ్లీ పిచ్‌పైకి వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. అనంతరం మళ్లీ బ్యాటింగ్‌కు వెళతాడు. ఇందులో నేర్చుకోవాల్సి చాలా ఉంది" అని అన్నాడు.
"ఒకసారి మీరు ఇన్‌స్టాగ్రాంలో నాకు మెసేజ్ చేశారు. దిగ్గజ క్రికెటర్ మీరు నాకు మెసేజ్ చేయడం ఏంటని, నేను షాక్‌కి గురయ్యాను. నేను ఆనందంలో పొంగిపోయాను. మీ పేరుతో ఉన్న స్టేడియంలో మంచి ప్రదర్శన చేయడం ఆనందంగా ఉంది. మీరు ఆడిన ఆటకి సంబంధించి హైలెట్స్ నేను చూస్తాను. వాటి నుంచి ఎంతో నేర్చుకున్నాను." అని గుర్తుచేశాడు.
శుభ్ మన్ గిల్ మాట్లాడుతూ.. బౌలర్లతో లారా మొదటి బంతి నుంచే దూకుదుకుగా ఆడే స్టైల్ నచ్చుతుందన్నాడు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో మొదటి బంతి నుంచే బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ, వారికి సవాల్ విసురుతాడు. ఈ దూకుడైన బ్యాటింగ్ శైలి నుంచి అన్ని క్రికెట్ ఫార్మాట్లలో రాణించడానికి సహాయపడుతుంది.
లారా కూడా భారత యువ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు. భారత్ నాకు రెండవ ఇల్లులాంటిదన్నారు. భారత ఆటగాళ్లు ఎదగటం నేను చూశానన్నాడు. వారిలో చాలా నైపుణ్యాలు దాగి ఉన్నాయన్నాడు. భారత్‌లో ఉన్న ప్రతిభ గల ఆటగాళ్ల నుంచి 3 ప్రధాన జట్లను ఎంపిక చేయవచ్చని వివరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com