PBKS vs CSK: పంజాబ్‌పై చెన్నై ప్రతీకార విజ‌యం

PBKS vs CSK: పంజాబ్‌పై చెన్నై ప్రతీకార విజ‌యం
X
ధ‌ర్మ‌శాల‌లో రవీంద్ర జ‌డేజా ఆల్‌రౌండ‌ర్ షో

డిఫెండింగ్ చాంపియ‌న్ చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌తీకార విజ‌యం సాధించింది. 17వ సీజ‌న్‌లో త‌మ‌పై ఆధిప‌త్యం చెలాయిస్తున్న‌ పంజాబ్ కింగ్స్‌కు ఎట్ట‌కేల‌కు చెక్ పెట్టింది. హిమాల‌య ప‌ర్వ‌త సానువుల్లోని ధ‌ర్మ‌శాల‌లో రవీంద్ర జ‌డేజా(43, 3/20) ఆల్‌రౌండ‌ర్ షోతో అద‌ర‌గొట్టగా పంజాబ్‌కు ఓట‌మి త‌ప్ప‌లేదు. స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌లో జ‌డ్డూ, తుషార్ దేశ్‌పాండే చెల‌రేగ‌డంతో పంజాబ్ టాప్ గ‌న్స్ చేతులెత్తేశారు. దాంతో, పంజాబ్‌ను 28 ప‌రుగుల తేడాతో చిత్తు చేసి.. ప్లే ఆఫ్స్ రేసులో ఓ అడుగు ముందుకేసింది. దాంతో, హ్యాట్రిక్ విజ‌యంతో ఒక‌టి రెండు స్థానాలు ఎగ‌బాకాల‌నుకున్న సామ్ క‌ర‌న్ బృందం ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో రికార్డు ల‌క్ష్యాన్ని(262 ర‌న్స్) ఛేదించిన‌ పంజాబ్ కింగ్స్ హిట్ట‌ర్లు స్వ‌ల్ప ఛేద‌న‌లో తేలిపోయారు. ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టో(7), రీలే ర‌స్సో(0)లను యువ పేస‌ర్ తుషార్ దేశ్‌పాండే ఒకే ఓవ‌ర్లో బౌల్డ్ చేశాడు. దాంతో, 9 ప‌రుగుల వ‌ద్ద రెండు ప‌డిన పంజాబ్ ఏ ద‌శ‌లోనూ కోలుకోలేక‌పోయింది. ఇంప్యాక్ట్ ప్లేయ‌ర్ ప్ర‌భ్‌సిమ్రాన్ సింగ్(30), శ‌శాంక్‌ సింగ్‌(27)లు కాసింత భ‌య‌పెట్టినా చెన్నై స్పిన్న‌ర్ల ఎత్తుల ముందు చిత్త‌య్యారు.


బౌండ‌రీలతో జోరుమీదున్న‌ ప్ర‌భ్‌సిమ్రాన్‌ను జ‌డేజా బోల్తాకొట్టించ‌గా.. శ‌శాంక్‌ను శాంట్న‌ర్ పెవిలియ‌న్ పంపాడు. ఆ త‌ర్వాత మ‌రోసారి త‌న మ్యాజిక్ చూపించిన జ‌డేజా ఒకే ఓవ‌ర్లో సామ్ క‌ర‌న్(3), అశుతోష్ శ‌ర్మ‌(7)ల‌ను ఔట్ చేసి పంజాబ్‌ను ఓట‌మి అంచుల్లోకి నెట్టాడు. 78 ప‌రుగుల‌కే టాప్ బ్యాట‌ర్లంతా డ‌గౌట్‌కు చేరిన వేళ.. టెయిలెండ‌ర్లు హ‌ర్ష‌ల్ ప‌టేల్(12), రాహుల్ చాహ‌ర్(16), హ‌ర్‌ప్రీత్ బ్రార్‌(17)లు కాసేపు ప్ర‌తిఘ‌టించారు. 28 ప‌రుగుల తేడాతో గెలుపొందిన సీఎస్కే ఆరో విజ‌యంతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నైని పంజాబ్ బౌల‌ర్లు వ‌ణికించారు. స్పిన్న‌ర్ రాహుల్ చాహ‌ర్(3/23), హ‌ర్ష‌ల్ ప‌టేల్(3/24)ల విజృంభ‌ణ‌తో డిఫెండింగ్ చాంపియ‌న్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. అయితే.. ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా(43) మ‌రోసారి ఆప‌ద్భాంధ‌వుడి పాత్ర పోషించాడు. ఓ వైపు స‌హ‌చ‌రులంతా డ‌గౌట్‌కు క్యూ క‌డుతున్నా ఒంట‌రి పోరాటంతో ఆక‌ట్టుకున్నాడు. మోయిన్ అలీ(), శార్థూల్ ఠాకూర్‌()ల‌తో కీల‌క భాగ‌స్వామ్యాలు నెల‌కొల్పాడు. టాప్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(32), డారిల్ మిచెల్‌(30)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. దాంతో, చెన్నై నిర్ణీత ఓవ‌ర్లలో 9 వికెట్ల న‌ష్టానికి 167 ప‌రుగులు చేయ‌గ‌లిగింది.

Tags

Next Story