Jadeja: మాకు అహంకారం లేదు, కపిల్ వాఖ్యలకు జడేజా కౌంటర్

ఇండియన్ స్పిన్నర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. భారత ఆటగాళ్లు జట్టులోకి రావడానికి చాలా కష్టపడుతున్నారు, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడం కోసం శ్రమిస్తున్నారన్నాడు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన కపిల్‌దేవ్ ప్రస్తుత భారత ఆటగాళ్లపై విమర్శలు చేశాడు. వారిలో అహం పెరిగిందని మాట్లాడాడు. భారత ఆటగాళ్లు ఐపిఎల్‌లో ఆడుతూ డబ్బు సంపాదనకే ప్రాధాన్యమిస్తున్నారన్నాడు. తమకు అంతా తెలుసనుకుంటున్నారని విమర్శించాడు.
ఈ వాఖ్యలకు నేపథ్యం సునీల్ గవాస్కర్ మీడియాతో సంభాషిస్తూ.. దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లు ఫాం కోల్పోయినపుడు తమ వద్ద సలహాలు తీసుకునే వారు, ఇప్పటి క్రికెటర్లు అలా లేరు అని అనడంతో కపిల్‌దేవ్ ఆ విధంగా స్పందించాడు.
జడేజా స్పందిస్తూ.. ప్రతీ ఆటగాడు బాగా కష్టపడుతాడు, దానికి శాయశక్తులా కృషి చేస్తురన్నాడు. ఇలాంటివి ఓడినపుడు మాత్రమే వస్తాయన్నాడు.
"కపిల్ ఇలా అన్నాడో లేదో నాకు తెలియదు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఉపయోగింను. ప్రతీ ఒక్కరికీ వారి వారి అభిప్రాయాలుంటాయి. అతను అన్నట్లుగా ఏమీ లేదు. ప్రతీ ఆటగాడు ఆటని ఆస్వాదిస్తూ, కష్టపడుతున్నారు. ఏ ఆటగాడు కూడా జట్టులో తమ స్థానం ఖాయం అని అనుకోవడం లేదు. అవకాశం వచ్చినపుడల్లా జట్టుకు విజయాన్నందించడానికి తమ శాయశక్తులా కృషి చేస్తురన్నారు" అని వెల్లడించాడు.
"ఏ ఆటగాడూ అహంకారంతో ఉండటం లేదు. జట్టు ఓడినపుడు మాత్రమే ఇలాంటి మాటలు అంటుంటారు. ప్రతీ ఆటగాడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని అనుకుంటాడు. వ్యక్తిగత ఎజెండాలు ఉండవు" అని బదులిచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com