JADEJA: "రాయల్స్‌కు తిరిగి రావడం ఎంతో ప్రత్యేకం"

రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరడంపై రవీంద్ర జడేజా స్పందించారు. “రాయల్స్ నాకు మొదటి అవకాశం ఇచ్చిన జట్టు. నా కెరీర్లో తొలి విజయాన్ని అందించిన వేదిక ఇదే. ఇప్పుడు తిరిగి రావడం నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇది నాకు కేవలం జట్టు మాత్రమే కాదు. నా ఇల్లు లాంటిది,” అని జడేజా భావోద్వేగంగా తెలిపారు.“జడేజా మళ్లీ రాయల్స్ జెర్సీ తొడగడం మా కోసం చాలా ప్రత్యేకం. ఆయన ఈ ఫ్రాంచైజీని, అభిమానులను బాగా అర్థం చేసుకుంటాడు. సామ్ (కరన్) కూడా బ్యాట్, బంతి రెండు చేతుల్లోనూ ఒత్తిడిని తట్టుకుని ఆడే ఆటగాడు. ఈ ఇద్దరూ కలిసి జట్టుకు సమతుల్యత, నాయకత్వం, మ్యాచ్ గెలిపించే శక్తిని అందిస్తారు” అని ఈ సందర్భంగా సంగక్కర వ్యాఖ్యానించారు.
నిరాశే కానీ తప్పలేదు"
జడేజా చెన్నై జట్టును వీడనుండటంపై ఆ ఫ్రాంఛైజీ సీఈఓ కాశీవిశ్వనాథన్ మాట్లాడారు. ‘జట్టుకు టాప్ ఆర్డర్ ఇండియన్ బ్యాటర్ కావాలని చెన్నై యాజమాన్యం కోరుకుంది. కానీ ఆక్షన్‌లో ఎక్కువమంది భారత బ్యాటర్లు లేరు. దీంతో ట్రేడ్ ద్వారా సొంతం చేసుకోవాలనుకున్నాం. కొన్ని సంవత్సరాలుగా చెన్నై సూపర్‌కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోన్న రవీంద్ర జడేజాను వదులుకోవడం నిజంగా కఠినమైన నిర్ణయం’ అని కాశీవిశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. ఇది తమను బాధించిందని తెలిపారు.
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి టెస్టులో రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు (91) కొట్టిన భారత ప్లేయర్ నిలిచాడు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ పేరుమీద ఉన్న అత్యధిక సిక్సర్ల (90) రికార్డు బ్రేక్ అయ్యింది. వీరేంద్ర 103 టెస్టుల్లో 90 సిక్సర్లు కొడితే... పంత్ 42 టెస్టుల్లోనే 91 సిక్సర్లు బాదేశాడు. వీరిద్దరి తరువాత రోహిత్ శర్మ 88, రవీంద్ర జడేజా 80, ఎంఎస్ ధోని 78 సికర్లతో ఉన్నారు. ఎముక విరగడంతో అతడు నాలుగు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుని టెస్ట్ ఆడుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

