JAI SHAH: నాకు అవగాహన లేదు: జై షా

JAI SHAH:  నాకు అవగాహన లేదు: జై షా
X
గంగూలీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంటందని వెల్లడి

WTC 2025-27 సీజన్‌కు సంబంధించి కొత్తగా బోనస్‌ పాయింట్ల వ్యవస్థను ICC ప్రవేశపెట్టనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ICC ఛైర్మన్‌ జై షా స్పష్టత ఇచ్చారు. 'గంగూలీ నేతృత్వంలోని క్రికెట్‌ కమిటీ ఈ కొత్త ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటుంది. WTCలో మార్పులు చేపట్టాలని ప్రాతిపాదనలు వచ్చాయి. అయితే వాటి గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు. ఈ అంశంపై క్రికెట్‌ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది’ అని జైషా అన్నారు. ఈ క్రికెట్‌ కమిటీలో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. వారిలో గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌, డానియల్‌ వెటోరీ, మహేలా జయవర్దనే, షాన్‌ పొలాక్‌ తదితరులు ఉన్నారు. ఏప్రిల్‌లో జరగనున్న ఐసీసీ బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జై షా తెలిపారు. భారీ తేడాలతో గెలిచే జట్లకు బోనస్‌ పాయింట్లు ఇవ్వాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం గెలిచిన జట్టుకు తేడాతో సంబంధం లేకుండా 12 పాయింట్లు, మ్యాచ్‌ టై అయితే 6 పాయింట్లు, డ్రాగా ముగిస్తే 4 పాయింట్లు కేటాయిస్తున్నారు. దీనిపై పలువురు మాజీలు, క్రికెట్‌ నిపుణుల నుంచి భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.

అక్టోబర్‌లో విండీస్‌తో భారత్‌ టెస్టు సిరీస్‌

భారత జట్టు సొంతగడ్డపై వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడబోతోంది. అక్టోబర్‌లో రెండు టెస్టుల పోరులో కరీబియన్‌ జట్టుతో రోహిత్‌ సేన తలపడనుంది. అక్టోబర్‌ 2న మొహలీలో తొలి టెస్టు, 10న కోల్‌కతాలో రెండో టెస్టు ఆరంభమవుతాయి. 2013-14లో భారత్‌లో రెండు జట్ల మధ్య చివరిగా టెస్టు సిరీస్‌ జరిగింది. వెస్టిండీస్‌తో పోరు ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికా రెండు టెస్టులతో పాటు 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌ ఆడుతుంది.

బెంచ్‌కే భువీ.. SRH ఫ్యాన్స్ ఆందోళన

KKRతో మ్యాచ్‌లో RCB పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను బెంచ్‌కే పరిమితం చేసింది జట్టు. తుది జట్టులో ఆయనకు చోటు కల్పించలేదు. దీంతో SRH అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అదే SRHలో ఉండుంటే డగౌట్‌లో కూర్చునే పరిస్థితి వచ్చి ఉండేది కాదని కామెంట్లు పెడుతున్నారు. తర్వాతి మ్యాచుకైనా భువీని జట్టులోకి తీసుకోవాలని RCB యాజమాన్యాన్ని కోరుతున్నారు. కాగా భువీ 10ఏళ్లకుపైగా SRHకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

IPL మ్యాచ్.. 2700 మందితో భద్రత

నేడు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‌- రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగనుండగా.. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. 2700 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్టేడియంలో 450 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే, స్టేడియంలోకి వాటర్ బాటిల్స్, ల్యాప్‌టాప్‌, అగ్గిపెట్టెలు, పలు ఎలక్ట్రానిక్‌ వస్తువులను నిషేధించినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story