AUS OPEN: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విన్నర్‌.. సిన్నర్‌

AUS OPEN: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విన్నర్‌.. సిన్నర్‌
X
వరుసగా రెండోసారి టైటిల్ కైవసం... అలెక్స్ జ్వెరేవ్ కు తప్పని నిరాశ

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ను జానిక్‌ సిన్నర్‌ గెలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో సిన్నర్‌ (ఇటలీ) 6-3, 7-6 (4) 6-3తో రెండో సీడ్‌ అలెగ్జాండ్‌ జ్వెరేవ్‌ (జర్మనీ)ని ఓడించాడు. దీంతో1992-93లో జిమ్‌ కొరియర్‌ తర్వాత పిన్న వయస్సులో వరుసగా 2సార్లు మెల్‌బోర్న్‌ పార్క్‌ విజేతగా నిలిచిన రికార్డును సిన్నర్ అందుకున్నాడు. మరోవైపు మూడో గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లోనూ జ్వెరేవ్‌కు పరాజయం తప్పలేదు. సిన్నర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. సిన్నర్‌ గతేడాది డానిల్‌ మెద్వెదెవ్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. సిన్నర్‌ వరుసగా రెండు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిళ్లు గెలిచిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. సిన్నర్ 2 ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిళ్లు, ఓ యూఎస్‌ ఓపెన్‌ గెలిచాడు. మరోవైపు తొలి మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో ఓడిన ఆరో ఆటగాడిగా అలెక్స్‌ జ్వెరెవ్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అలెక్స్‌ జ్వెరెవ్‌కు ముందు ఆండ్రీ అగస్సీ, గోరాన్‌ ఇవానిసెవిక్‌, ఆండీ​ ముర్రే, డొమినిక్‌ థీమ్‌, కాస్పర్‌ రూడ్‌ కూడా తొలి మూడు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌లో ఓడారు.


మహిళల సింగిల్స్ విజేత కీస్

టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీ ‘ఆస్ట్రేలియన్ ఓపెన్’లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 2025 టోర్నీ ఛాంపియన్‍గా అమెరికాకు చెందిన 14వ ర్యాంక్ ప్లేయర్ మ్యాడిసన్ కీస్ నిలిచారు. తన కెరీర్లో తొలి గ్రాండ్‍స్లామ్ టైటిల్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‍లో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ అర్యానా సబలెంకాకు షాక్ ఇచ్చారు మ్యాడిసన్. మూడు సెట్ల పాటు పోరాడి గెలిచారు. ఫైనల్‍లో మ్యాడిసన్ కీస్ 6-3, 2-6, 7-5 తేడాతో బెలారస్ స్టార్ సబలెంకపై విజయం సాధించారు. గత రెండు సంవత్సరాలు ఆస్ట్రేలియా టైటిల్ గెలిచిన సబలెంకకు ఈసారి ఫైనల్‍లో ఎదురుదెబ్బ తగిలి.. హ్యాట్రిక్ మిస్ అయింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన మ్యాడిసన్ కీస్ 2.22 మిలియన్ డాలర్లు (సుమారు రూ.19 కోట్ల) ప్రైజ్‍మనీ దక్కింది. భారీ మొత్తాన్ని కీస్ అందుకున్నారు.

Tags

Next Story