AUSTRAILA OPEN: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పెను సంచలనం

AUSTRAILA OPEN: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పెను సంచలనం
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు షాక్‌... జోకో ఆశలపై నీళ్లు చల్లిన సిన్నర్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌కు షాక్‌ తగిలింది. పదకొండోసారి ఆస్ట్రేలియా ఓపెన్‌ గెలవాలన్న జోకో ఆశలపై నాలుగో సీడ్‌ ఇటలీకి చెందిన జానిక్‌ సిన్నర్‌ నీళ్లు చల్లాడు. AUSTRAILA OPEN: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పెను సంచలనంసెమీఫైనల్లో 22 ఏళ్ల సినెర్‌ ముందు జొకోవిచ్‌ తలవంచక తప్పలేదు. జొకోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి మరీ జానిక్‌ సిన్నర్‌ తన కెరీర్‌లోనే భారీ విజయం సాధించాడు. 6-1, 6-2, 6-7, 6-3తో జకోవిచ్‌పై..గెలిచాడు. జొకోవిచ్‌పై గెలిచి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరాడు. మూడో సీడ్‌ మెద్వెదేవ్, ఆరో సీడ్‌ అలెగ్జాండర్ జ్వెరెవ్‌ మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన ఆటగాడితో ఫైనల్లో సిన్నర్‌ తలపడతాడు.


మహిళల ప్రపంచ నంబర్‌ వన్‌ ఇగా స్వైటెక్‌(Iga Swiatek) కూడా ఇప్పటికే మూడో రౌండ్‌లోనే వెనుదిరిగింది. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో స్వైటెక్‌పై.. అన్‌సీడెడ్‌ నొకోవా(Linda Noskova) విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ స్వైటెక్‌ 6-3, 3-6, 4-6తో ప్రపంచ 50వ ర్యాంకర్‌ లిండా నొకోవా చేతిలో ఓడింది. తొలి సెట్‌ను సునాయసంగానే గెలిచిన స్వైటెక్‌.. ఆ తర్వాత అనవసర తప్పిదాలు, పేలవ సర్వీసులతో ఓడిపోయింది. రెండున్నర గంటల పాటు సాగిన పోరులో స్వైటెక్‌ 4 ఏస్‌లు కొట్టి ఒక డబుల్‌ ఫాల్ట్‌ చేస్తే.. నొకొవా 10 ఏస్‌లు బాదింది. స్వైటెక్‌ 34 విన్నర్లు సంధిస్తే.. నొకొవా 35 విన్నర్లు కొట్టి.. 37 అనవసర తప్పిదాలు చేసింది.


బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లు ఆడిన నోస్కోవా.. రెండో సెట్‌ ఎనిమిదో గేమ్‌లో స్వైటెక్‌ సర్వీస్‌ బ్రేక్‌ చేసి 5-3తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరుతో సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో స్వైటెక్‌ కాస్త మెరుగ్గా ఆడినా.. నోస్కోవా తగ్గలేదు. ఏ దశలోనూ స్వైటెక్‌కు అవకాశం ఇవ్వలేదు. అంతేకాక ఏడో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసి 4-3తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈ రష్యా అమ్మాయి..అదే దూకుడు కొనసాగించి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న స్వైటెక్‌.... ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోతోంది. మెల్‌బోర్న్‌లో స్వైటెక్‌ ఒక్కసారి కూడా సెమీఫైనల్‌ దాటలేదు. మిగిలిన మ్యాచుల్లో పన్నెండో సీడ్‌ కిన్వెన్‌ జెంగ్‌ (చైనా), 18వ సీడ్‌ విక్టోరియా అజరెంకా (బెలారస్‌), స్వితోలినా (ఉక్రెయిన్‌) ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్లో ఇప్పటిదాకా రెండో రౌండ్‌ దాటని జెంగ్‌ 6-4, 2-6, 7-6 (10-8)తో చైనాకే చెందిన వాంగ్‌ను ఓడించి తుది 16లో చోటు దక్కించుకుంది.

Tags

Read MoreRead Less
Next Story