IPL 2022 Auction: ఐపీఎల్ మెగావేలం .. ఇంతకీ ధగధగ మెరిసిపోతున్న ఈ అమ్మాయి ఎవరు?

IPL 2022 Auction: ఐపీఎల్ 2020 మెగావేలం సూపర్ సక్సెస్ అయింది.. ఇందులో కొందరు ఆటగాళ్ళు జాక్‌పాట్ కొట్టగా మరికొందరికి మాత్రం ఊహించని షాక్ ఎదురైంది.. ఈ మెగావేలంలో ఆటగాళ్ళతో పాటుగా ఓ 19 ఏళ్ల అమ్మాయి కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ధగధగ మెరిసిపోతున్న ఈ అమ్మాయి ఎవరని నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.
ఆమె పేరు జాహ్నవి మెహతా... బాలీవుడ్ హీరోయిన్ జూహీ చావ్లా కూతురు. 19 ఏళ్ల జాహ్నవి.. విదేశాల్లో డిగ్రీ కంప్లీట్ చేసింది.. ప్రస్తుతం కోల్‌కతా టీం సహాయజమానిగా బాధ్యతలు చూసుకుంటుంది. వేలంలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ అందర్నీ ఆకట్టుకుంది. జాహ్నవితో పాటుగా కోల్‌కతా తరఫున షారుఖ్ కుమారుడు ఆర్యన్‌ఖాన్, కుమార్తె సుహానా కూడా వేలంలో పాల్గొన్నారు.
ఇక 1984లో మిస్ ఇండియా విజేతగా నిలిచిన జూహీ చావ్లా.. హిందీ భాషలోనే కాక, పంజాబీ, మళయాళం, కన్నడ, తమిళ్, తెలుగు, బెంగాలీ భాషల్లో కూడా సినిమలు చేసింది.. ముఖ్యంగా 1980, 90 వ దశకాల్లో ఆమె బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. 1995లో ప్రముఖ పారిశ్రామికవేత్త జయ్ మెహతా ను వివాహం చేసుకోగా వీరికి జాహ్నవి, అర్జున్ అనే ఇద్దరు పిల్లలున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com