JOE ROOT: "క్రికెట్ గాడ్" రికార్డుకు రూట్ సవాల్

JOE ROOT: క్రికెట్ గాడ్ రికార్డుకు రూట్ సవాల్
X
41వ శతకం బాదిన జో రూట్... టెస్టుల్లో పాంటింగ్ రికార్డు సమం... సచిన్ రికార్డుకు చేరువగా రూట్... సచిన్ పేరుపై అత్యధిక పరుగుల రికార్డు

టె­స్టు క్రి­కె­ట్ చరి­త్ర­లో తి­రు­గు­లే­ని రి­కా­ర్డు­ల­తో 'క్రి­కె­ట్ గా­డ్'­గా ని­లి­చిన సచి­న్ టెం­డూ­ల్క­ర్ సా­మ్రా­జ్యా­ని­కి ఇం­గ్లాం­డ్ బ్యా­ట­ర్ జో రూట్ సవా­ల్ వి­సు­రు­తు­న్నా­డు. ఆస్ట్రే­లి­యా­తో జరు­గు­తు­న్న ఐదో యా­షె­స్ టె­స్టు­లో తన 41వ శత­కా­న్ని పూ­ర్తి చే­సిన రూట్ శత­కాల సం­ఖ్య­లో ది­గ్గజ బ్యా­ట­ర్ రికీ పాం­టిం­గ్‌­ను సమం చే­య­డ­మే కా­కుం­డా.. పరు­గుల వే­ట­లో­నూ సచి­న్ రి­కా­ర్డు­కు అత్యంత చే­రు­వ­య్యా­డు. టె­స్టు­ల్లో అత్య­ధిక పరు­గుల రి­కా­ర్డు (15,921 పరు­గు­లు) ప్ర­స్తు­తం సచి­న్ టెం­డూ­ల్క­ర్ పే­రిట ఉంది. సో­మ­వా­రం నాటి ఇన్నిం­గ్స్‌­తో జో రూట్ 14,000 పరు­గుల మై­లు­రా­యి­కి చే­రు­వ­వ­డ­మే కా­కుం­డా, సచి­న్ రి­కా­ర్డు­ను అధి­గ­మిం­చేం­దు­కు అవ­స­ర­మైన దూ­రా­న్ని 2,000 పరు­గుల లో­పు­న­కు తగ్గిం­చా­డు. ఇదే ఫా­మ్‌­ను మరో రెం­డే­ళ్లు కొ­న­సా­గి­స్తే, టె­స్టు క్రి­కె­ట్ చరి­త్ర­లో అత్య­ధిక పరు­గు­లు చే­సిన బ్యా­ట­ర్‌­గా జో రూట్ సరి­కొ­త్త చరి­త్ర సృ­ష్టిం­చ­డం ఖా­యం­గా కని­పి­స్తోం­ది.

రూట్ రికార్డుల హోరు

35 ఏళ్ల రూట్, ఈ సి­రీ­స్‌­లో రెం­డో సెం­చ­రీ నమో­దు చే­శా­డు. 163 టె­స్టు­ల్లో­నే 41 శత­కా­లు పూ­ర్తి చే­సిన రూట్, 168 టె­స్టు­ల్లో అదే సం­ఖ్య­లో సెం­చ­రీ­లు చే­సిన పాం­టిం­గ్‌­ను వె­న­క్కి నె­ట్టి ముం­దు­కు సా­గు­తు­న్నా­డు. ప్ర­స్తు­తం రూట్ కంటే ముం­దు ఉన్న­వా­ళ్లు ఇద్ద­రే సచి­న్ టెం­డూ­ల్క­ర్ 51 సెం­చ­రీ­లు, జాక్ కల్లీ­స్ 45 సెం­చ­రీ­లు. పరు­గుల పరం­గా ఇప్ప­టి­కే పాం­టిం­గ్, సం­గ­క్క­ర­ల­ను దా­టే­సిన రూట్.. సచి­న్ రి­కా­ర్డు­కు అతి చే­రు­వ­య్యా­డు. ఇంకో 2000 పరు­గు­లు చే­స్తే, టె­స్ట్ క్రి­కె­ట్‌­లో అత్య­ధిక పరు­గు­లు చే­సిన బ్యా­ట­ర్‌­గా ని­లి­చే అవ­కా­శ­ముం­ది.

దూసుకుపొతున్న రూట్

శత­కా­లు, అర్ధ సెం­చ­రీల వి­ష­యం­లో­నూ రూట్ దూ­సు­కు­పో­తు­న్నా­డు. ప్ర­స్తు­తం 41 సెం­చ­రీ­ల­తో ఉన్న రూట్.. సచి­న్ (51 సెం­చ­రీ­లు) కంటే 10 సెం­చ­రీల దూ­రం­లో ఉన్నా­డు. అలా­గే అత్య­ధిక హాఫ్ సెం­చ­రీ­లు చే­సిన సచి­న్ (68) రి­కా­ర్డు­ను అధి­గ­మిం­చేం­దు­కు రూ­ట్‌­కు మరో మూడు అర్ధ సెం­చ­రీ­లు మా­త్ర­మే అవ­స­రం. 2021 నుం­చి అసా­ధా­రణ ఫా­మ్‌­లో ఉన్న రూట్ కే­వ­లం నా­లు­గు ఏళ్ల­లో­నే 24 సెం­చ­రీ­లు సా­ధిం­చ­డం అతడి పరు­గుల దా­హా­ని­కి ని­ద­ర్శ­నం. టె­స్టు­ల్లో అత్య­ధిక సెం­చ­రీ­లు చే­సిన వారి జా­బి­తా­లో ప్ర­స్తు­తం సచి­న్ (51), జా­క్వె­స్ కలి­స్ (45) మా­త్ర­మే రూట్ కంటే ముం­దు­న్నా­రు. పాం­టిం­గ్‌­ను సమం చే­సిన రూట్, త్వ­ర­లో­నే కలి­స్ రి­కా­ర్డు­ను కూడా దాటే అవ­కా­శం ఉంది. ఆస్ట్రే­లి­యా గడ్డ­పై యా­షె­స్ సి­రీ­స్‌­లో ఒకటి కంటే ఎక్కువ సెం­చ­రీ­లు చే­సిన అతి­కొ­ద్ది మంది ఇం­గ్లాం­డ్ బ్యా­ట­ర్ల ఎలై­ట్ జా­బి­తా­లో­ రూట్ చే­రి­పో­యా­డు.

Tags

Next Story