IPL: బట్లర్ విధ్వంసం..గుజరాత్ విజయం

IPL: బట్లర్ విధ్వంసం..గుజరాత్ విజయం
X
ఢిల్లీపై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. బట్లర్ మెరుపులతో గెలిచిన గుజరాత్

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ అయిదో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయ కేతనం ఎగరేసింది. బ్యాటింగ్ కు అనుకూల‌మైన వికెట్ పై ఢిల్లీ బ్యాట‌ర్లు స‌మ‌ష్టిగా రాణించాడు. అంద‌రూ త‌లో చేయి వేయ‌డంతో 200 ప‌రుగుల మార్కును దాటింది. ఆరంభంలో అభిషేక్ పోరెల్ (9 బంతుల్లో 18, 3 ఫోర్లు, 1 సిక్స‌ర్) ధాటిగా ఆడే ప్ర‌య‌త్నంలో ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత క‌రుణ్ నాయ‌ర్ (31), కేఎల్ రాహుల్ (28) వేగంగా ఆడే ప్ర‌య‌త్నం చేశారు. వీరిద్ద‌రూ వెనుదిరిగిన త‌ర్వాత ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (31), అశుతోష్ శ‌ర్మ (37)లతో కలిసి జ‌ట్టును ముందుకు న‌డిపారు. ఇక ఢిల్లీ బ్యాట‌ర్ల‌కు అద్భుత‌మైన శుభారంభాలు లభించిన‌ప్పటికీ, వాటిని స‌ద్వినియోగం చేసుకోలేదు. చివ‌ర్లో కుల్దీప్ యాదవ్ ఆడిన తొలి బౌండ‌రీ కొట్టడంతో 203 ప‌రుగుల మార్కును దాటింది.

బట్లర్ జోరు..

ఈ భారీ లక్ష్యాన్ని గుజరాత్ 19.2 ఓవర్లలో ఛేదించింది. వన్‌డౌన్ బ్యాటర్ జోస్ బట్లర్ (97*; 54 బంతుల్లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ (36; 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడాడు. షెర్పాన్‌ రూథర్‌ఫోర్డ్ (43; 33 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) రాణించాడు. చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 10 పరుగులు అవసరం కాగా.. రాహుల్ తెవాతియా (11*; 3 బంతుల్లో) వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

అంతకుముందు....

ఢిల్లీ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా మెరుపులు మెరిపించినా ఒక్కరూ భారీ స్కోర్లు చేయలేకపోయారు. అభిషేక్‌ పొరెల్‌కు జోడీగా కరుణ్‌ను పంపించింది. సిరాజ్‌ తొలి ఓవర్లోనే 4, 6, 4తో పొరెల్‌ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా అర్షద్‌ ఖాన్‌ రెండో ఓవర్లో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన రాహుల్‌ (28).. 4, 6, 4, 4తో ఉన్నంతసేపు ధాటిగానే ఆడాడు. కరుణ్‌ సైతం రెండు బౌండరీలు, రెండు సిక్సర్లతో జోరు కనబరిచాడు. కానీ ప్రసిద్ధ్‌.. రాహుల్‌తో పాటు కరుణ్‌నూ పెవిలియన్‌కు చేర్చాడు. వీరి స్థానాల్లో వచ్చిన అక్షర్‌, స్టబ్స్‌ కాస్త నెమ్మదించినా రన్‌రేట్‌ పడిపోకుండా చూసుకున్నారు. ఆఖర్లో అశుతోశ్‌ మెరుపులతో ఢిల్లీ 200 రన్స్‌ మార్కును దాటింది.

Tags

Next Story