JUREL: భవిష్యత్తు "ధ్రువ్‌" తార అతడేనా..?

JUREL: భవిష్యత్తు ధ్రువ్‌ తార అతడేనా..?
X
సెంచరీతో రాణించిన ధ్రువ్ జురెల్.. కీపర్‌గాను సూపర్‌గా రాణించిన జురెల్.. ఆత్మవిశ్వాసంతో కనిపించిన జురెల్

టీ­మిం­డి­యా వి­కె­ట్ కీ­ప­ర్ బ్యా­ట్స్‌­మె­న్ రి­ష­బ్ పంత్ గాయం తర్వాత జట్టు­లో­కి వచ్చిన యువ ఆట­గా­డు ధ్రు­వ్ జు­రె­ల్ అహ్మ­దా­బా­ద్‌­లో అద్భు­తం సృ­ష్టిం­చా­డు. వె­స్టిం­డీ­స్‌­తో జరి­గిన తొలి టె­స్ట్ మ్యా­చ్ రెం­డో రోజు తన టె­స్ట్ కె­రీ­ర్‌­లో తొలి సెం­చ­రీ­ని నమో­దు చే­శా­డు. సెం­చ­రీ సా­ధిం­చిన తర్వాత అతను ఒక వి­నూ­త్న శై­లి­లో సె­ల్యూ­ట్ చేసి తన ఆనం­దా­న్ని పం­చు­కు­న్నా­డు. టీ­మిం­డి­యా స్టా­ర్ వి­కె­ట్ కీ­ప­ర్ బ్యా­ట్స్‌­మె­న్ రి­ష­బ్ పంత్ గాయం కా­ర­ణం­గా కొంత కాలం జట్టు­కు దూ­ర­మ­య్యా­డు. అహ్మ­దా­బా­ద్‌­లో వె­స్టిం­డీ­స్‌­తో జరు­గు­తు­న్న తొలి టె­స్ట్ మ్యా­చ్ రెం­డో రోజు ధ్రు­వ్ జు­రె­ల్ అద­ర­గొ­ట్టా­డు. సెం­చ­రీ కొ­ట్టిన తర్వాత అతను ఒక ప్ర­త్యే­క­మైన రీ­తి­లో సె­ల్యూ­ట్ చేసి సం­బ­రా­లు చే­సు­కు­న్నా­డు. మ్యా­చ్ రెం­డో రోజు ఆట ము­గి­సిన తర్వాత, ధ్రు­వ్ జు­రె­ల్ తను ఎవ­రి­కి సె­ల్యూ­ట్ చే­శా­డో స్వ­యం­గా వె­ల్ల­డిం­చా­డు.

పూర్తి ఆత్మవిశ్వాసంతో..

వె­స్టిం­డీ­స్‌­తో జరి­గిన మొ­ద­టి మ్యా­చ్‌­లో జు­రే­ల్‌.. పూ­ర్తి ఆత్మ­వి­శ్వా­సం­తో కని­పిం­చా­డు. తన ఇన్నిం­గ్స్‌­లో మూడు అద్భు­త­మైన సి­క్స్‌­లు కూడా బా­దా­డు. ఇటీ­వ­లే ఆస్ట్రే­లి­యా-ఎతో మ్యా­చ్‌­లు ఆడా­డు. అవి అత­డి­లో ఆత్మ­వి­శ్వా­సా­న్ని పెం­చా­యి. కో­చ్‌ గౌ­త­మ్‌ గం­భీ­ర్‌, కె­ప్టె­న్‌ శు­భ్‌­మ­న్‌ గి­ల్‌ ప్రో­త్సా­హ­మూ జు­రే­ల్‌­ను ముం­దు­కు­న­డి­పి­స్తు­న్నా­యి. టీ­మ్ఇం­డి­యా యువ వి­కె­ట్‌ కీ­ప­ర్‌ ధ్రు­వ్‌ జు­రే­ల్‌ తనను తాను సి­ద్ధం చే­సు­కుం­టూ, పక్కా ప్ర­ణా­ళి­క­తో ముం­దు­కు­సా­గు­తు­న్నా­డు. ‘ప్ర­త్య­ర్థి జట్టు స్వ్కా­డ్‌­ను పరి­శీ­లిం­చా. అం­దు­లో ఎం­త­మం­ది సీ­మ­ర్లు, స్పి­న్న­ర్లు ఉన్నా­రో గమ­నిం­చా. వా­ళ్ల ప్లా­న్ ఏమి­టా.. అని ఆలో­చిం­చా. దా­ని­కి తగ్గ­ట్లు నన్ను నేను సి­ద్ధం చే­సు­కుం­టు­న్నా. సీ­ని­య­ర్ల వి­లు­వైన సల­హా­లు, సూ­చ­న­లు తీ­సు­కుం­టు­న్నా. వా­ళ్ల అను­భ­వం నాకు మా­ర్గ­ని­ర్దే­శ­నం చే­స్తోం­ది’ అని ధ్రు­వ్‌­జు­రే­ల్ వె­స్టిం­డీ­స్‌­తో మ్యా­చ్‌­కు ముం­దు అన్నా­డు.

నో రిషబ్ పంత్‌.. నో ప్రోబ్లమ్‌

భా­ర­‌త టె­స్టు జ‌­ట్టు­లో స్టా­ర్ వి­కె­ట్ కీ­ప­‌­ర్ బ్యా­ట­‌­ర్ రి­ష­‌­బ్ పంత్ లేని లో­టు­ను ధ్రు­వ్ జు­రె­ల్ తీ­ర్చా­డు. అహ్మ­దా­బా­ద్ వే­ది­క­గా వె­స్టిం­డీ­స్‌­తో జరు­గు­తు­న్న తొలి టె­స్టు­లో జు­రె­ల్ అద్బు­త­మైన సెం­చ­రీ­తో చె­ల­రే­గా­డు. పంత్ గా­య­ప­డం­తో తన దక్కిన అవ­కా­శా­న్ని జు­రె­ల్ రెం­డు చే­తు­లా అం­ది­పు­చ్చు­కు­న్నా­డు. ధ్రు­వ్ జు­రె­ల్ గతే­డా­ది ఫి­బ్ర­వ­రి­లో ఇం­గ్లం­డ్‌­పై భారత తర­పున టె­స్టు అరం­గే­ట్రం చే­శా­డు. తన డె­బ్యూ సి­రీ­స్‌­లో జు­రె­ల్ తన ప్ర­ద­ర్శ­న­ల­తో అం­ద­రి­ని ఆక­ట్టు­కు­న్నా­డు. కానీ రి­ష­బ్ పంత్ రె­గ్యూ­ల­ర్ వి­కె­ట్ కీ­ప­ర్‌­గా ఉం­డ­డం­తో జు­రె­ల్ ఇప్ప­టి­వ­ర­కు టీ­మిం­డి­యా తర­పున కే­వ­లం 6 టె­స్టు మ్యా­చ్‌­లు మా­త్ర­మే ఆడా­డు. అక్టో­బ­ర్‌ 19 నుం­చి టీ­మ్ఇం­డి­యా ఆస్ట్రే­లి­యా­లో పర్య­టిం­చ­నుం­ది. ఇం­దు­లో­భా­గం­గా మూడు వన్డే­లు, అయి­దు టీ20లు ఆడ­నుం­ది. వన్డే జట్టు­కు ధ్రు­వ్ జు­రే­ల్ వి­కె­ట్‌ కీ­ప­ర్‌­గా ఎం­పి­క­య్యా­డు. ఆసీ­స్ గడ్డ­పై అతడు వన్డే­ల్లో­నూ రా­ణిం­చి, ని­ల­క­డ­గా పరు­గు­లు రా­బ­ట్ట­గ­లి­గి­తే, భవి­ష్య­త్తు­లో టీ­మ్‌­ఇం­డి­యా స్టా­ర్‌ క్రి­కె­ట­ర్‌­గా­నూ ఎది­గే అద్భుత అవ­కా­శ­ముం­ది. ధ్రు­వ్‌ జు­రే­ల్‌ ఇప్ప­టి­వ­ర­కు టీ­మ్ఇం­డి­యా తర­ఫున 6 టె­స్ట్‌ మ్యా­చ్‌­లు ఆడి 47.5 సగ­టు­తో 380 పరు­గు­లు చే­శా­డు. 4 టీ20ల్లో భారత జట్టు­కు ప్రా­తి­ని­ధ్యం వహిం­చా­డు.

Tags

Next Story