CRCKET: ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు

CRCKET: ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు
X
చరిత్ర సృష్టించిన కరుణ్‌ నాయర్‌.... అజేయంగా’ ప్రపంచ రికార్డు బ్రేక్‌

టీమ్ఇండియా ఆట‌గాడు క‌రుణ్ నాయ‌ర్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. లిస్ట్‌-ఏ 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో ఔట్ కాకుండా అత్యధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. విజ‌య్ హ‌జారే ట్రోఫీలో విద‌ర్భకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌ర‌ుణ్ నాయ‌ర్ ఉత్తర‌ప్రదేశ్‌తో జ‌రిగిన మ్యాచులో సెంచరీ చేశాడు. 101 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 112 ప‌రుగులు చేశాడు. ఇప్పటికే వరుసగా రెండు శతకాలు బాదిన కరణ్ నాయర్.. ఉత్తర్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సెంచరీ చేసి హ్యాట్రిక్ శతకాలు సాధించాడు. ఈ క్రమంలోనే ఓ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌తో కరుణ్ నాయర్‌ లిస్ట్ ఎ క్రికెట్‌లో నాటౌట్‌గా నిలుస్తూ అత్యధిక పరుగులు (542) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు జేమ్స్ ఫ్రాంక్లిన్ (527) పరుగులు పేరిట ఉండేది.

గత నాలుగు మ్యాచ్‌ల్లో కరుణ్ నాయర్ నాటౌట్‌గా నిలిచాడు. జమ్మూ కాశ్మీర్‌పై (112*; 108 బంతుల్లో), ఛత్తీస్‌గడ్‌పై (44*), చంఢీగడ్‌పై (163*; 107 బంతుల్లో), తమిళనాడుపై (111*; 103 బంతుల్లో) పరుగుల వరద పారించాడు. దీంతో విదర్భ ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

ఇంగ్లాండ్‌పై ట్రిపుల్ సెంచరీ

భారత్ తరఫున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్‌ నాయర్‌ (Karun Nair) జట్టుకు దూరమై చాలాకాలమే అయింది. కరుణ్‌ 2016లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో ట్రిపుల్ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో గత రెండు సీజన్లలో అన్‌సోల్డ్‌గా ఉండగా.. ఇటీవల ముగిసిన మెగా వేలంలో రూ.50 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్‌ సొంతం చేసుకుంది.

Tags

Next Story