Kardashian: మెస్సీ, రొనాల్డోలో ఎవరు ఉత్తమం, కిమ్ సమాధానం ఇదే!

Kim Kardashian-Ishowspeed: లియోనల్ మెస్సీ ఇంటర్ మియామీతో మొదటి మ్యాచ్ ఆడుతున్నపుడు స్టేడియానికి వచ్చి అలరించిన సెలెబ్రిటీ కిమ్ కర్ధాషియన్, రొనాల్డో అభిమానులు ఏమైనా అనుకుంటారేమో అనుకుందేమో గానీ, క్రిస్టియానో రొనాల్డో ఆడుతున్న మ్యాచ్‌కి కూడా హాజరైంది. తన కుమారులు సెయింట్, సాల్మ్‌తో కలిసి మ్యాచ్‌కు హాజరైంది. క్రిస్టియానో రొనాల్డో ఆడుతున్న అల్ నాజర్ జట్టు, ఫ్రాన్స్ క్లబ్ అయిన పీఎస్‌జీతో జపాన్‌లో తలపడింది.
అయితే అక్కడి వచ్చిన మరో యువ సెలెబ్రిటీ, ఇన్‌ఫ్లూయెన్సర్ ఐ షో స్పీడ్(IshowSpeed) కర్ధాషియన్ పిల్లలను ఆటపట్టించాడు. కర్ధాషియన్ కుమారులు పీఎస్‌జీ జెర్సీ ధరించడంతో, లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలో ఎవరు ఉత్తమ ఆటగాళ్లు అని వారిని ప్రశ్నిస్తూ హాస్యం పండించాడు. మీరు పీఎస్‌జీ జెర్సీ ఎందుకు ధరించారు, క్రిస్టియానో జెర్సీ ధరించాలంటూ ఆటపట్టించాడు.
మెస్సీ, రొనాల్డో డిబేట్‌లో విమర్శల పాలు కావద్దనుకున్న కిమ్ ఇద్దరూ ఇష్టమే అని సమాధానమిచ్చింది. అయితే కిమ్ కర్దాషియన్ ఏ జట్టుకు మద్దతిస్తుందో ఆ జట్టు ఓడిపోతుందనే మీమ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.
“If Messi scores this free kick, I’m a Messi fan, wallahi” 😭😭😭😭 pic.twitter.com/dhkoa8oGSV
— Speedy HQ (@iShowSpeedHQ) July 22, 2023
ఐషోస్పీడ్ మెస్సీ ఆడిన మియామీ మ్యాచ్‌కి కూడా రొనాల్డో జెర్సీయే ధరించి వచ్చాడు. చివరి నిమిషంలో మెస్సీ ఫ్రీకిక్ కొట్టే ముందు మెస్సీ గోల్ కొడితే నేను మెస్సీ అభిమానినవుతానన్నాడు. మెస్సీ గోల్ కొట్టడంతో రొనాల్డో డ్రెస్ తీసేసి మెస్సీ జెర్సీతో సంబురాలు చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com