KKR: కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్

KKR: కేకేఆర్ అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్
X

కో­ల్‌­క­తా నైట్ రై­డ­ర్స్ ఇం­డి­య­న్ ప్రీ­మి­య­ర్ లీగ్ (IPL) 2026 సీ­జ­న్‌­కు ముం­దు తమ కో­చిం­గ్ బృం­దం­లో కీలక మా­ర్పు చే­సిం­ది. ఆస్ట్రే­లి­యా మాజీ ఆల్‌­రౌం­డ­ర్ షేన్ వా­ట్స­న్ను జట్టు­కు అసి­స్టెం­ట్ కో­చ్‌­గా ని­య­మిం­చి­న­ట్లు అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చిం­ది. 44 ఏళ్ల షేన్ వా­ట్స­న్ అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­లో వి­శేష అను­భ­వం కలి­గిన ఆట­గా­డు. ఆయన ఆస్ట్రే­లి­యా తర­ఫున 59 టె­స్టు­లు, 190 వన్డే­లు, 58 టీ20 ఇం­ట­ర్నే­ష­న­ల్ మ్యా­చ్‌­ల­లో ప్రా­తి­ని­ధ్యం వహిం­చి, 10,000 కంటే ఎక్కువ పరు­గు­లు, 280 కంటే ఎక్కువ వి­కె­ట్లు పడ­గొ­ట్టా­రు. 2007, 2015 ప్ర­పంచ కప్‌ల వి­జేత ఆస్ట్రే­లి­యా జట్ల­లో ఆయన కీలక సభ్యు­డు. కే­కే­ఆ­ర్ ప్ర­ధాన కో­చ్‌­గా ని­య­మి­తు­లైన భారత మాజీ అసి­స్టెం­ట్ కోచ్ అభి­షే­క్ నా­య­ర్‌­తో కలి­సి వా­ట్స­న్ పని చే­య­ను­న్నా­రు. తన ని­యా­మ­కం­పై స్పం­దిం­చిన వా­ట్స­న్, "కో­ల్‌­క­తా­కు మరో టై­టి­ల్ తీ­సు­కు­రా­వ­డా­ని­కి కో­చిం­గ్ బృం­దం, ఆట­గా­ళ్ల­తో కలి­సి పని చే­య­డా­ని­కి నేను ఆస­క్తి­గా ఉన్నా­ను" అని సం­తో­షం వ్య­క్తం చే­శా­రు. ఐపీ­ఎ­ల్‌­లో కూడా వా­ట్స­న్‌­కు సు­దీ­ర్ఘ అను­బం­ధం ఉంది.

ఆయన 2008 నుం­చి 2020 వరకు 145 ఐపీ­ఎ­ల్ మ్యా­చ్‌­లు ఆడి 4 సెం­చ­రీ­లు నమో­దు చే­శా­రు. వా­ట్స­న్ గతం­లో రా­జ­స్థా­న్ రా­య­ల్స్, చె­న్నై సూ­ప­ర్ కిం­గ్స్ ఛాం­పి­య­న్ జట్ల­లో ఆడా­రు. 2008లో రా­జ­స్థా­న్ రా­య­ల్స్‌­కు తొలి ఐపీ­ఎ­ల్ టై­టి­ల్ అం­దిం­చ­డం­లో కీలక పా­త్ర పో­షిం­చి, ఆ సీ­జ­న్‌­లో, అలా­గే 2013లో మో­స్ట్ వా­ల్యూ­వ­బ­ల్ ప్లే­య­ర్ (MVP) అవా­ర్డు­ను గె­లు­చు­కు­న్నా­రు. కే­కే­ఆ­ర్ గతం­లో ఢి­ల్లీ క్యా­పి­ట­ల్స్‌­తో కో­చ్‌­గా అను­బం­ధం ఉన్న వా­ట్స­న్ అను­భ­వా­న్ని తమ టై­టి­ల్ లక్ష్యా­ని­కి ఉప­యో­గిం­చు­కో­వా­ల­ని చూ­స్తోం­ది.

Tags

Next Story