IPL 2025: తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు!

IPL 2025: తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు!
X
తొలి మ్యాచ్‌లో కోల్‌కతా, బెంగళూరు ఢీ... వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా

ఐపీఎల్-2025 ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న తొలి మ్యాచ్‌లో కోల్‌కతా, బెంగళూరు తలపడనున్నాయి. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు, మ్యాచ్‌కు ముందు వేడుకలు నిర్వహించడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఫొటోలకు పోజులిచ్చిన కెప్టెన్లు

శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సందడి ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్‌ మొదలెట్టేశాయి. ఈక్రమంలో ఈ మెగా టోర్నీ ప్రారంభం కావడానికి ముందు బీసీసీఐ అన్ని జట్ల కెప్టెన్లతో సమావేశం ఏర్పాటుచేసింది. దీంతో అందరూ ఒక్కచోట చేరి కప్పుతో గ్రూప్‌ ఫొటోలు దిగారు. పలువురు కెప్టెన్లు సరదాగా మాట్లాడుకుంటూ కనిపించారు. దీంతో అభిమానులు ఈ ఫొటోలు చూసి ముచ్చటపడిపోతున్నారు.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తీసేస్తారా?

ఐపీఎల్ 2025 సీజన్ అంగరంగ వైభవంగా మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంలో ఈ రోజు (మార్చి 20) కెప్టెన్ల సమావేశంలో ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తొలగించే అంశంపై చర్చ జరుగుతున్నట్టు సమాచారం. 2023లో ప్రవేశపెట్టిన ఈ నిబంధన వల్ల చాలా ఆటల ట్రెండ్ మారడం గమనార్హం. అయితే కొంతమంది క్రికెట్ విశ్లేషకులు దీని వల్ల యువ ఆటగాళ్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కోహ్లీ షూస్‌ వేసుకుని సెంచరీ చేశా: నితీశ్‌

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి సెంచరీ చేయడంపై భారత ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘మ్యాచ్‌ రోజు డ్రెసింగ్‌ రూమ్‌లో కోహ్లీ తన షూ ఇవ్వడానికి సర్ఫరాజ్‌‌ను సైజ్ అడిగారు. అతను 9 అని చెప్పడంతో నావైపు తిరిగారు. నా సైజ్‌ షూస్‌ కాకపోయినా సరే బూట్లు నాకు కావాలి అని మనసులో అనుకున్నాను. నా షూ సైజ్ అడిగిన వెంటనే నేను 10 అని చెప్పా. కోహ్లీ షూస్‌ నాకు ఇచ్చాడు. ఆ బూట్లతోనే సెంచరీ చేశా. ’ అని చెప్పారు.

Tags

Next Story