
దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో బాధపడుతుండగా.. అతడి స్థానంలో జట్టు పగ్గాలు కేఎల్ రాహుల్‌కు అప్పగించారు. ఈనెల 30 నుంచి డిసెంబరు 6 వరకు జరిగే సిరీస్ కోసం సెలెక్టర్లు 15 మందితో కూడిన జాబితాను ఆదివారం వెల్లడించారు. ఇటీవల ఆస్ర్టేలియా పర్యటనకు వెళ్లిన వన్డే జట్టు నుంచి నాలుగు మార్పులు చేశారు. కీపర్ రిషభ్ పంత్ జట్టులోకి వచ్చాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా గాయంతో దూరం కావడంతో రాహుల్‌కు డిప్యూటీగా పంత్ వ్యవహరించనున్నాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్ స్థానంలో హైదరాబాదీ తిలక్ వర్మకు చోటు దక్కింది. రెండేళ్ల క్రితం తను భారత్ తరఫున చివరి వన్డే ఆడాడు.
గిల్ దూరం
మెడ నొప్పితో బాధపడుతున్న భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు మరింత విశ్రాంతి అవసరమున్నట్టు తెలుస్తోంది. దీంతో దక్షిణాఫ్రికాతో ఈనెల 30 నుంచి ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీ్‌సకు అతను దూరం కానున్నాడు. అయితే సఫారీలతోనే జరిగే టీ20 సిరీ్సకల్లా గిల్ బరిలోకి దిగే అవకాశం ఉందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జట్టు కెప్టెన్సీ రేసులో కేఎల్ రాహుల్‌తో పాటు కీపర్ పంత్ పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెండో టెస్టు సారథిగా వ్యవహరిస్తున్న పంత్ ఏడాది కాలంగా ఒక్క వన్డే మాత్రమే ఆడాడు. ఈ ఫార్మాట్లో ప్రధాన కీపర్‌గా రాహుల్‌నే పరిగణిస్తుండడం గమనార్హం. ఓపెనర్లుగా జైస్వాల్, వెటరన్ రోహిత్‌తో పాటు టాపార్డర్‌లో కోహ్లీ ఆడనున్నాడు. హర్షిత్, సిరాజ్, అర్ష్‌దీప్ పేసర్లుగా ఉండే చాన్సుంది. బుమ్రాకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినివ్వచ్చు. స్పిన్నర్ కుల్దీప్ వ్యక్తిగత కారణాలతో గైర్హాజరు కానుండగా అక్షర్, సుందర్, వరుణ్ జట్టులో ఉంటారు.
అయ్యర్ ఆటకు దూరం
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో గాయపడ్డ టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో తిరిగి మైదానంలో కనిపించే అవకాశాలు కనిపించడం లేదు. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. అయ్యర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాచ్ అందుకొనే క్రమంలో బలంగా నేలను తాకాడు. దీంతో అతడి ప్లీహానికి తీవ్ర గాయమైంది. అంతర్గత రక్తస్రావం అయింది. ఆ తర్వాత అతడిని ఐసీయూలో చేర్పించి, చికిత్స అందించారు. ప్రస్తుతం రీహాబ్‌లో ఉన్న అయ్యర్.. కోలుకునేందుకు మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ఆస్ట్రేలియాతో రెండో వన్డే సందర్భంగా క్యాచ్ పట్టే ప్రయత్నంలో డైవ్ చేయగా.. అతడి కడుపులో తీవ్ర గాయమైన సంగతి తెలిసిందే. సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో రెండు రోజులు ఐసీయూలో ఉండి చికిత్స చేయించుకున్న అతను.. అక్కడి నుంచి డిశ్చార్జి అయి స్వదేశానాకి వచ్చాడు. లోపల గాయం పూర్తిగా మాని, శ్రేయస్ మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి రెండు నెలలకు పైగానే సమయం పడుతుందట. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు కూడా అతను అందుబాటులోకి రాడట. ఫిట్నెస్ సాధించినా మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు కాబట్టి ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగే టీ20 ప్రపంచకప్ ఎంపికకు శ్రేయస్ పేరును సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం కష్టమే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


