IND vs NZ : టీమిండియాకి బిగ్‌షాక్.. గాయంతో కేఎల్ రాహుల్ ఔట్..!

Ind vs Nz : న్యూజిలాండ్‌తో జరిగిన టీ-20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా మరో సమరానికి రెడీ అయింది. ఈనెల 25 నుంచి కాన్పూర్ వేదికగా జరిగే టెస్ట్ మ్యాచ్‌కు భారత్ జట్టు సిద్ధమైంది. ఇప్పటికే కాన్పూర్ చేరుకున్న టీమిండియా నెట్ ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. కాగా.. కాలినొప్పి కారణంగా న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు కేఎల్ రాహుల్ దూరమయ్యారు. రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నట్లుగా బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా ఇప్పటికే రోహిత్, కోహ్లి గైర్హాజరీ కానుండడం.. తాజాగా రాహుల్ కూడా దూరమవ్వడం టీమిండియాకు పెద్ద దెబ్బగా మారనుంది. మరోవైపు టీ-20 సిరీస్ ఓటమితో కసిమీదున్న న్యూజిలాండ్ జట్టు.. టెస్ట్ మ్యాచ్‌తో బరిలోకి దిగుతోంది. భారత్‌ను కచ్చితంగా ఓడించి 33 ఏళ్ల రికార్డును మార్చేస్తామని కివీస్ స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ ధీమా వ్యక్తం చేశాడు.
టీమిండియా టెస్టు జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, అక్సర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com