KLAASEN: సంచలనం.. క్రికెట్‌కు క్లాసెన్ వీడ్కోలు

KLAASEN: సంచలనం.. క్రికెట్‌కు క్లాసెన్ వీడ్కోలు
X
మరో స్టార్ ప్లేయర్ సెన్సేషనల్ నిర్ణయం

క్రికెట్ అభిమానులకు మరో షాక్. ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్ రౌండర్ మ్యాక్స్ వెల్ వన్డే రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటలకే మరో స్టార్ ప్లేయర్ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడు. దక్షిణాఫ్రికా పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. దక్షిణాఫ్రికా పవర్‌ఫుల్ బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్ 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏజ్ లోనే అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ను వదిలేయడం నిజంగా షాకింగే. ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడే క్లాసెన్ తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కు ఇష్టమైన ఆటగాళ్లలో ఒకడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత క్లాసెన్ ఈ ప్రకటన చేశాడు.

భావోద్వేగ వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు. క్లాసెన్ వయసు ప్రస్తుతం 33 ఏళ్ల 307 రోజులు మాత్రమే. సౌతాఫ్రికాకు ఆడటం తనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన సహచరులతోపాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడంతో ఇకపై కుటుంబంతో మరింత ఎక్కువ సమయం గడుపుతానని పేర్కొన్నాడు. క్లాసెన్ సౌతాఫ్రికా తరఫున నాలుగు టెస్టులు ఆడి 104 పరుగులు, 60 వన్డేల్లో 2141 రన్స్, 58 టీ20లు ఆడి 1000 పరుగులు చేశాడు. క్లాసెన్ ఇటీవల ఐపీఎల్‌ 2025లో సన్‌రైజర్స్ తరఫున ఆడాడు. ఇవాళే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ కూడా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే టీ20 క్రికెట్‌లో క్లాసెన్ విధ్వంస‌క‌ర బ్యాట‌ర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టీ20 కెరీర్‌ను పొడిగించాల‌ని అత‌ను నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో అత‌ను స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ర‌పున ఆడాడు. ఇక మేజ‌ర్ లీగ్ క్రికెట్ టోర్నీలో సియాటెల్ ఆర్కాస్ త‌ర‌పున‌ఆడేందుకు అత‌ను కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ద హండ్రెడ్ టోర్నీలో అత‌ను మాంచెస్ట‌ర్ ఒరిజిన‌ల్స్ త‌ర‌పున ఆడ‌నున్నాడు.

Tags

Next Story