Shikhar Dhawan: నాకౌట్‌కు అర్హత సాధించడంలో విఫలం.. తండ్రి చేతిలో తన్నులు తిన్న శిఖర్ ధావన్

Shikhar Dhawan: పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైన తర్వాత శిఖర్ ధావన్ తండ్రి చేతిలో తన్నులు తిన్నాడు. తండ్రి కొట్టడంతో నేలపై పడిపోయాడు.
శిఖర్ ధావన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. శిఖర్ ధావన్ బ్యాటింగ్‌తో IPL సీజన్‌ను ఆకట్టుకున్నాడు, కానీ అతని జట్టు పంజాబ్ కింగ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ప్లేఆఫ్‌లకు అర్హత సాధించడంలో విఫలమైంది.
సీజన్ ప్రారంభానికి ముందే PBKSలో చేరిన వెటరన్ బ్యాటర్, 14 మ్యాచ్‌లలో 38.3 సగటుతో 460 పరుగులు చేశాడు. అయినప్పటికీ, అతను తన జట్టును ప్లేఆఫ్‌కు తీసుకెళ్లాలని ఆశించాడు. సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలను పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటాడు. తన అభిమానులను నవ్వించడానికి ప్రయత్నించాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.
తండ్రి.. కొడుకు శిఖర్ ని కొడుతున్నాడు.. అతని కుటుంబ సభ్యులు అతనిని ఆపడానికి ప్రయత్నిస్తున్నా తండ్రి కొట్టడం చూడవచ్చు. ఇదంతా సరదాగా చేసిన వీడియో..
"నాకౌట్‌కు అర్హత సాధించనందుకు మా నాన్నచే నాకౌట్" అని ధావన్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. చిన్న చిన్న వీడియోలు చేస్తూ తనలో ఉన్న నటుడిని కూడా బయటకు తీస్తున్న శిఖర్ త్వరలోనే బాలీవుడ్ తెరపై కనిపించబోతున్నాడని టాక్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com