KOHLI: విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ స్టాండింగ్ ఒవేషన్

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ డకౌటైన కోహ్లీకి ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ లభించింది. కోహ్లీ డకౌట్ అయినా.. ప్రేక్షకులంతా కింగ్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. అడిలైడ్ ఫ్యాన్స్ ఘన వీడ్కోలు పలికారు. ముఖ్యంగా అడిలైడ్ మైదానంతో కోహ్లీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ ఒక్క మైదానంలోనే కోహ్లీ 5 శతకాలు బాదాడు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్లో ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ రికార్డ్ సాధించాడు.
కెరీర్ లోనే తొలిసారి
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటయ్యాడు. తొలి వన్డేల్లో 8 బంతులు ఆడి ఖాతా తెరవలేకపోయిన కోహ్లి.. గురువారం తనకు అచ్చొచ్చే మైదానమైన అడిలైడ్‌లో 4 బంతుల డకౌట్‌ను నమోదు చేశాడు. కోహ్లి తన 17 ఏళ్ల కెరీర్‌లో వరుసగా రెండు వన్డేల్లో డకౌట్ కావడం ఇదే మొదటిసారి.
రోహిత్ శర్మ సరికొత్త రికార్డు
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నాడు. 9180+ పరుగులు చేసి.. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ (9146)ని అధిగమించాడు. రోహిత్ కంటే ముందు.. సచిన్(15310), సనత్ జయసూర్య (12740), క్రిస్ గేల్ (10179), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (9200) వరుస నాలుగు స్థానాల్లో ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

