KOHLI: డేంజర్లో సచిన్, కోహ్లీ రికార్డులు

అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ నేపథ్యంలో టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ రికార్డులు డేంజర్ లో పడ్డాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్ గా ఎదుగుతున్న జో రూట్.. ఈ సిరీస్ లో సచిన్, కోహ్లీ రికార్డులను బ్రేక్ చేసే అవకాశముంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్‌లలో విరాట్ కోహ్లీ అత్యంత విజయవంతమైన బ్యాటర్. అన్ని ఫార్మాట్లలో కలిపి కోహ్లీ 4,036 పరుగులు చేశాడు. సచిన్ 3,990 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం 3858 రన్స్‌తో ఉన్న రూట్.. మరో 133 పరుగులు చేస్తే సచిన్‌ను అధిగమిస్తాడు. 179 రన్స్ రాబడితే కోహ్లీ రికార్డును బ్రేక్ చేసి టాప్‌లోకి వెళతాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో 13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేశాడు. రూట్ మరో ఐదు అర్ధ శతకాలు చేస్తే సచిన్, కోహ్లీ (32)ను దాటేస్తాడు.
ఆ రికార్డులు కూడా...
ఇప్పటివరకు భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధికంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 16 హాఫ్ సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్ 13 అర్ధ శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జో రూట్ 11 హాఫ్ సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. రూట్ మరో 3 అర్ధ శతకాలు చేస్తే సచిన్‌ను అధిగమిస్తాడు. ఒకవేళ 6 హాఫ్ సెంచరీలు చేస్తే గవాస్కర్‌ను అధిగమించి ఈ జాబితాలో అగ్రస్థానంలో దూసుకెళ్తాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com