KOHLI: ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు

భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్‌ను టీమిండియా శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాడినా దక్షిణాఫ్రికాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో కొత్త చరిత్ర రాశారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. ఈ క్రమంలో కోహ్లీ, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించారు. ఈ మ్యాచ్ లో సూపర్ నాక్ తో కోహ్లీ వన్డేల్లో 52వ సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు ఒకే ఫార్మాట్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. సచిన్ తన కెరీర్లో టెస్ట్ ఫార్మాట్లో 51 సెంచరీలు సాధించాడు. ఈ ఇన్నింగ్స్ తో కొట్టి కోహ్లీ ప్రపంచ క్రికెట్ లో ఒకే ఒక్కడిగా నిలిచాడు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో భారత గడ్డపై అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా కూడా కోహ్లీ ఇప్పుడు టాప్ ప్లేస్ దక్కించుకున్నారు. దేశంలో ఆయన చేసిన ఇది 59వ 50+ స్కోరు. దీంతో ఆయన సచిన్ టెండూల్కర్ (58 హాఫ్ సెంచీరలు)ను దాటేశాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్వెస్ కాలిస్ టెస్ట్‌ల్లో 45 సెంచరీలు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 41 టెస్ట్ సెంచరీలతో తరువాతి స్థానాల్లో ఉన్నారు.
సచిన్ రికార్డు బ్రేక్
ఈ వన్డేలో విరాట్ కోహ్లీ 52వ సెంచరీ సాధించాడు. ఈ ఫార్మాట్లో అత్యధిక శతకాల రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. అయితే దక్షిణాఫ్రికాపై అత్యధిక వన్డే శతకాలు చేసిన బ్యాటర్ గా నిలిచాడు. తాజాగా సఫారీలపై ఆరో వన్డే శతకాన్ని కింగ్ కోహ్లీ నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ పేరిట ఉండేది. మరోవైపు రాంచీ రారాజు తానేనని కోహ్లీ ప్రూవ్ చేసుకున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

