KOHLI:ఐపీఎల్‌కు విరాట్ కోహ్లీ వీడ్కోలు.!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయలేదనే ప్రచారం సాగుతోంది.2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐకాన్ ప్లేయర్‌గా ఉన్నాడు విరాట్ కోహ్లీ. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2025లో ఆ జట్టుకు మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని అందించాడు. ఆ చరిత్రాత్మక విజయం తర్వాత, 'కింగ్' మరిన్ని సీజన్లు ఆడతాడని ఫ్యాన్స్ అందరూ ఆనందంలో ఉండగా, ఒక్కసారిగా ఒక వార్త పెను తుఫానులా దూసుకొచ్చింది. విరాట్ కోహ్లీ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా? ఆర్సీబీతో తన కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసుకోవడానికి నిరాకరించాడా? అనే గాసిప్స్ వైరల్ అయ్యాయి.
కైఫ్ కీలక కామెంట్స్
ఐపీఎల్ ప్లేయర్ కాంట్రాక్ట్, కమర్షియల్ కాంట్రాక్ట్ మధ్య వ్యత్యాసాన్ని వెల్లడిస్తూ మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో చేశాడు. కోహ్లీ ఆర్సీబీలోనే కొనసాగుతాడని స్పష్టం చేశాడు. అయితే ఆర్సీబీ కమర్షియల్ కాంట్రాక్ట్‌పై కోహ్లీ సంతకం చేయకపోవడానికి ఓ కారణం ఉందని కైఫ్ వెల్లడించారు. ఆర్సీబీకి కొత్త యజమాని వచ్చే అవకాశం ఉందని, కొత్తవారి రాకతో ఫ్రాంచైజీ నిర్ణయాలు మారవచ్చని, అందుకే కోహ్లీ వేచి చూస్తున్నాడని అన్నాడు. ఒకవేళ యజమాని మారితే.. కొత్త చర్చలు జరుగుతాయని, వీటిపై స్పష్టమైన సమాచారం లేదని, కోహ్లీ కూడా వేచి చూస్తున్నాడని కైఫ్ పేర్కొన్నాడు.ఒకవేళ యజమాని మారితే.. కొత్త చర్చలు జరుగుతాయని, వీటిపై స్పష్టమైన సమాచారం లేదని, కోహ్లీ కూడా వేచి చూస్తున్నాడని కైఫ్ పేర్కొన్నాడు. కొత్త యాజమాన్యం వస్తే ఆర్సీబీ కోహ్లీ గుడ్ చెప్పే అవకాశం మాత్రం చాలా తక్కువ ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరికొందరు మాత్రం గుడ్ బై చెప్పిన ఆశ్చర్యం లేదని అంటున్నారు.
ఆందోళనలో ఫ్యాన్స్
ఇటీవల వచ్చిన కొన్ని మీడియా రిపోర్టుల ప్రకారం, ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు విరాట్ కోహ్లీ RCBతో తన కమర్షియల్ కాంట్రాక్ట్‌ను రెన్యువల్ చేసుకోవడానికి నిరాకరించినట్లు తెలిసింది. అంతేకాకుండా "భవిష్యత్ ప్రణాళికలలో నన్ను ఉపయోగించుకోవద్దు" అని యాజమాన్యానికి తాను సూచించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికే టెస్టు, టీ20 ఇంటర్నేషనల్స్‌కు వీడ్కోలు పలికిన కోహ్లీ, ఇప్పుడు ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్పేస్తున్నాడనే వార్తలు ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్‌కు గురి చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద చర్చే జరిగుతోంది. ఈ రిటైర్మెంట్ రూమర్స్‌పై టీమ్ఇండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పష్టతనిచ్చాడు. ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదని, అసలు విషయం వేరే ఉందని చెప్పాడు. కోహ్లీ నిరాకరించింది ఆర్సీబీతో తన ప్లేయింగ్ కాంట్రాక్ట్‌ను కాదని, కేవలం కమర్షియల్ కాంట్రాక్ట్‌ను మాత్రమేనని వివరించాడు. కోహ్లీ జట్టుతో ఆడటానికి, జట్టు ప్రమోషనల్ యాక్టివిటీస్‌కు వేర్వేరు ఒప్పందాలు ఉండవచ్చని, అందులో కమర్షియల్ డీల్‌ను మాత్రమే వద్దనుకున్నాడని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com