IPL: ప్లే ఆఫ్‌ రేసు నుంచి కోల్‌కతా అవుట్..!

IPL: ప్లే ఆఫ్‌ రేసు నుంచి కోల్‌కతా అవుట్..!
X
ఉత్కంఠభరిత మ్యాచులో చెన్నై గెలుపు... ప్లే ఆఫ్ నుంచి దాదాపుగా వైదొలిగిన కోల్‌కతా

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ భవితవ్యం తేలిపోయింది. ఐపీఎల్‌ 18వ సీజన్‌ ప్లేఆఫ్స్‌ రేసు నుంచి కోల్‌కతా వైదొలిగింది. కేవలం లీగ్‌ దశతోనే కోల్‌కతా సరిపెట్టుకుంది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా పరాజయం పాలైంది. ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతాపై చెన్నై సూపర్‌ కింగ్స్‌ కేవలం రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో 12 మ్యాచ్‌ల్లో ఆరో ఓటమిని ఎదుర్కొన్న కోల్‌కతా ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. తొలుత కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

విజయాన్ని అందించిన ధోనీ

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 179 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో ఓపెనర్ రహ్మనుల్లా (11) త్వరగానే నిష్క్రమించగా.. సునీల్ నరైన్ (26; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడాడు. కెప్టెన్ అజింక్య రహానె (48; 33 బంతుల్లో) రాణించాడు. ఆండ్రీ రస్సెల్ (38; 21 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. మనీశ్‌ పాండే (36*; 28 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ (4/31) మెరిశాడు. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై రెండు బంతులు మిగిలి ఉండగా విజయం సాధించింది. చెన్నై ఓపెనర్లు ఆయుష్ మాత్రే, డేవాన్ కాన్వే డకౌట్ అయ్యారు. వచ్చిన అరంగేట్ర ఆటగాడు ఉర్విల్‌ పటేల్‌ (31; 11 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) ఆకట్టుకున్నాడు. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (52; 25 బంతుల్లో) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. శివమ్‌ దూబె (45; 40 బంతుల్లో) రాణించాడు. చివర్లో కాస్త ఉత్కంఠ నెలకొనగా.. ధోనీ (17*; 18 బంతుల్లో 1 సిక్స్‌) జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Tags

Next Story