LeBron James Bronny:బాస్కెట్‌బాల్ దిగ్గజ ఆటగాడి కుమారుడికి గుండెపోటు..

Lebron James-Bronny James: బాస్కెట్ బాల్ దిగ్గజం, లాస్ ఏంజెల్స్ లేకర్స్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ పెద్ద కుమారుడు బ్రానీ జేమ్స్ అకస్మాత్తు గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరాడు. లాస్ ఏంజెల్స్‌లో మ్యాచ్‌కు ముందు వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తు గుండెనొప్పితో భాదపడటంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అతను కోలుకుని, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండటంతో ICU నుంచి బయటకు తెచ్చారు.18 సంవత్సరాల వయసున్న బ్రాన్నీ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాతో ఆడుతున్నపుడు ఈ సంఘటన జరిగింది. యుఎస్‌సీ జట్టు తరఫున ఇప్పుడిపుడే ఆరంగేట్రం చేస్తూ, ఉత్తమంగా ఆడుతూ తండ్రి జేమ్స్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. ఉత్తమ హైస్కూల్ బాస్కెట్ బాల్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు.
"నిన్న సాధన చేస్తుండగా గుండెనొప్పితో బాధపడ్డాడు. వైద్యసిబ్బంది వెంటనే స్పందించి సకాలంలో ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ICUలో ఉండాల్సిన అవసరం లేదు." అని వారి కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావివ్వకుండా మా కుటుంబానికి గౌరవం, ప్రైవసీ ఇవ్వాలని కోరారు. ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామని వెల్లడించారు. సకాలంలో స్పందించి చికిత్స అందించిన వైద్యసిబ్బంది, అథ్లెటిక్స్ సిబ్బందికి లెబ్రాన్ జేమ్స్, అతని భార్య అభినందనలు తెలియజేస్తోందని ఆ ప్రకటన వివరించింది.
ఇటీవల కాలంలో గుండెపోటులకు గురవుతున్న క్రీడాకారుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com