లీడ్స్ ఇంగ్లాండ్దే.. భారత్ ఘోర ఓటమి
లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 212/2 శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్ తడబడ్డారు. టీమిండియా తొలి సెషన్‌లోనే మిగతా 8 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దీసేపటికే పుజారా (91) రాబిన్‌సన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(55) హాఫ్ సెంచరీతో రాణించినా.. రాబిన్‌సన్ బౌలింగ్‌లోనే స్లిప్‌లో రూట్ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్ స్కోర్ 237/4గా నమోదై కష్టాల్లో పడింది. వైస్ కెప్టెన్ రహానె(10), పంత్(1), షమి(6), ఇషాంత్(2), జడేజా(30), సిరాజ్(0) కనీస పోరాటం చేయకుండా వెనుదిరిగారు. రాబిన్‌సన్ 5 వికెట్లతో రాణించాడు. ఓవర్టన్ మూడు, అండర్సన్, మొయిన్ అలీ చెరో వికెట్ సాధించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com