SRIKANTH: ఫైనల్‌లో శ్రీకాంత్‌కు తప్పని నిరాశ

మలేసియా మాస్టర్స్ టైటిల్ ఫైనల్లో స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ బోల్తా పడ్డాడు. టైటిల్ ఆశలు రేపిన శ్రీకాంత్‌కు.. ఫైనల్లో నిరాశ తప్పలేదు. ఆరేళ్ల తర్వాత ఓ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరుకున్న శ్రీకాంత్‌కు.. చైనా ఆటగాడు లీ షిఫెంగా షాక్ ఇచ్చాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్‌లో శ్రీకాంత్ 11-9, 21-9 తేడాతో చైనా ఆటగాడు లీ షిఫెంగ్ చేతిలో శ్రీకాంత్ పరాజయం పాలయ్యారు. ఫైనల్‌కు ముందు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గి శ్రీకాంత్ ఎదురులేకుండా కనిపించాడు. అయితే, టైటిల్ పోరులో మాత్రం దారుణంగా నిరాశపరిచాడు. చైనా ప్లేయర్ చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలై రన్నరప్‌గా నిలిచాడు. చైనా షట్లర్‌కు శ్రీకాంత్ కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాడు. కేవలం 36 నిమిషాల్లోనే రెండు గేములను కోల్పోయి రన్నరప్‌గా సరిపెట్టాడు. 2017లో శ్రీకాంత్ చివరిసారిగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గాడు. ఆ తర్వాత మరో టైటిల్ సాధించలేకపోయాడు. 2019లో ఇండియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకున్నా అక్కడా బోల్తాపడ్డాడు. ఇన్నేళ్ల తర్వాత ఓ టోర్నీలో ఫైనల్‌లో అడుగుపెట్టగా శ్రీకాంత్‌కు నిరాశే ఎదురైంది.
ఆత్మ విశ్వాసాన్ని పెంచేదే
కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేసిన శ్రీకాంత్‌కు మలేసియా మాస్టర్స్‌లో ఫైనల్ వరకు చేరుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. శ్రీకాంత్ చివరిసారిగా 2019లో ఇండియా ఓపెన్‌లో టైటిల్ పోరు ఆడాడు. 2017లో చివరి సారిగా ఓ టైటిల్ గెలిచాడు. మలేసియా మాస్టర్స్‌లో జోరు మీద ఉన్న శ్రీకాంత్ 8 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలని చూసినా అది సాధ్యం కాలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com