Inter Miami- Lionel Messi: అమెరికా గడ్డపై మెస్సీ అడుగు

అమెరికాని ఫుట్‌బాల్ ఫీవర్ తాకింది. ఫుట్‌బాట్ మేటి ఆటగాడు లియోనల్ మెస్సీ(Lionel Messi) ఇంటర్ మియామీ క్లబ్‌లో చేరిన తర్వాత తొలిసారి స్టేడియంలో అభిమానుల ముందుకు వచ్చాడు. ఇంటర్ మియామీ(Inter Miami)లో అతని రాక కోసం ఎన్నో రోజులుగా వేచి చూసిన మెస్సీ అభిమానులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా స్టేడియంలో ఈ కార్యక్రమం మొత్తం వీక్షించారు.
20 వేల మందితో నిండిపోయిన స్టేడియంలో వెలుగులు విరమజిమ్ముతున్న స్టేడియం మధ్యలో మెస్సీ.. మెస్సీ నినాదాల మధ్య తెలుపు రంగు టీ షర్ట్ ధరించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్లబ్ ఓనర్లు జార్జ్ మాస్, మాజీ సాకర్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్(David Beckham) మెస్సీకి స్వాగతం పలికారు. నంబర్.10(Number 10) ఇంటర్ మియామీ జెర్సీని ఆవిష్కరించారు.
Bienvenido a nuestra familia💗🖤 pic.twitter.com/k7VOSGo1lv
— Inter Miami CF (@InterMiamiCF) July 17, 2023
"మియామికి రావడంతో తాను చాలా సంతోషిస్తున్నాను" అని స్పానిష్ భాషలో ప్రేక్షకులకు అభివారం తెలిపాడు.
"మీరు నాపై చూయిస్తున్న ప్రేమ, అనురాగాలకు నా ధన్యవాదాలు. ఇది చాలా తొందరగా జరిగిపోయింది. టీంతో కలిసి ఆడి, గెలవాలని అనుకుంటున్నాను. ఇది నాకు మంచి అనుభూతినివ్వబోతుంది" అని ప్రేక్షకులకు అభివాదం తెలిపాడు.
ఇప్పటి నుంచి మియామీలో మెస్సీకి ముందు, మెస్సీకి తర్వాత కాలం ఉంటుందని ఇంటర్ మియామీ ఓనర్ జార్జ్ మాస్ ప్రకటించాడు. ఈ వర్షం పవిత్రమైందని అన్నాడు. ఈ క్షణాలు అమెరికా(USA)లో ఫుట్‌బాల్ గతిని మార్చుతుందన్నాడు. ఈ నంబర్ 10. ఇక అమెరికా నంబర్.10 అని మెస్సీపై అభిమానాన్ని కురిపించాడు.
మాజీ స్టార్ ఆటగాడు డేవిడ్ బెక్‌హాం మాట్లాడుతూ.. మెస్సీ రావడంతో మా కల నిజమైందన్నాడు. అమెరికాలో ఇంతకుముందు పెద్ద స్థాయిలో పరిచయ కార్యక్రమం జరిగింది డేవిడ్ బెక్‌హాందే. అతను 2007లో లాస్‌ఏంజెల్స్ గెలాక్సీ(Los Angles Galaxy)లో చేరాడు.
గత సీజన్‌లో ఫ్రాన్స్‌కి చెందిన పారిస్ సెయింట్-జెర్మైన్ క్లబ్(PSG)ని వీడి అమెరికాలోని మేజర్ లీగ్ సాకర్(Major League Soccer)లోని ఇంటర్ మియామీ క్లబ్‌లో చేరుతున్నట్లు ప్రకటించాడు. ఇంటర్ మియామీతో సంవత్సరానికి 50 మిలియన్ డాలర్ల నుంచి 60 మిలియన్ల డాలర్ల దాకా చెల్లించేట్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో పాటుగా క్లబ్‌లో వచ్చే లాభాల్లోనూ వాటా పంచుకోనున్నాడు.
ఇంటర్ మియామీ క్లబ్ ఆడే మ్యాచ్ టికెట్ ధరలు ఏకంగా 1034శాతం పెరగడం మెస్సీ పట్ల ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తుంది.
మెస్సీని ఇంటర్ మియామీ ప్రేక్షకుల ముందు తెచ్చిన పరిచయ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా 3.5 బిలియన్ల వ్యూస్‌తో, ఇంతకు ముందు క్రిస్టియానో రొనాల్డో సౌదీ క్లబ్ అల్ నాసర్‌లో చేరినపుడు ఉన్న రికార్డును చెరిపేశాడు.
ఈ కార్యక్రమంలో లియోనల్ మెస్సీతో పాటుగా అతని బార్సిలోనా సహచర ఆటగాడు, బార్సిలోనా జట్టు కెప్టెన్ సెర్జియో బుస్కెట్‌ను కూడా ప్రేక్షకుల ముందు తీసుకువచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com