Inter Miami-Messi: మియామీ తరఫున మెస్సీ తొలి మ్యాచ్ ఎప్పుడంటే..

Messi-InterMiami
Messi-InterMiami

ఫుట్‌బాల్ స్టార్, అర్జెంటీనా ఆటగాడు లియోనల్ మెస్సీ తదుపరి మ్యాచ్‌ ఎప్పుడా అని అభిమానులు కోట్లాది కళ్లతో ఎదురుచూస్తున్నారు. జూన్ 7న ఫ్రాన్స్ క్లబ్ పారిస్ సెయింట్- జెర్మైన్‌ని వదిలి అమెరికాలోని ఇంటర్ మియామి క్లబ్‌(Inter Miami)లో చేరనున్నట్లు ప్రకటించాడు. అయితే ఆ జట్టు తరపున ఇంకా మెస్సీ అభిమానుల ముందు రాలేదు. కానీ ఆ క్లబ్ ఆడుతున్న మ్యాచ్‌లకు మాత్రం టికెట్‌ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంటర్ మియామి క్లబ్ కూడా తన స్టేడియంలో మెస్సీకి స్వాగత కార్యక్రమాలు చేపట్టలేదు. పారిస్ సెయింట్- జెర్మైన్‌తో కాంట్రాక్ట్ జూన్ 30న ముగియడంతో ఈ జులై నెలలో ఆరంగ్రేటం చేసే అవకాశం ఉంది. జులై 21న క్రజ్ అజల్‌తో తలపడే మ్యాచ్‌లో మైదానంలో దిగనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.



PSG వీడిన తర్వాత మెస్సీ తన పాత క్లబ్ అయిన బార్సిలోనాకి వెళ్లవచ్చని అనుకున్నారంతా. మరోవైపు సౌదీ ప్రో లీగ్‌ నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి. అల్ హిలాల్ క్లబ్ 1.9 ఆస్ట్రేలియన్ డాలర్ల భారీ డీల్‌కి కూడా మెస్సీ మొగ్గు చూపవచ్చనే వార్తలూ వచ్చాయి. ఎందుకంటే మెస్సీ సమకాలీకుడు, మరో ఫుట్‌బాల్ లెజెండ్ ఇప్పటికే సౌదీ లీగ్‌లోని అల్ నాజర్ తరఫున ఆడుతున్నాడు. రొనాల్డోకి భారీ మొత్తంలో 200 మిలియన్ యూరోలని ఆ క్లబ్‌ చెల్లిస్తోంది. వీటన్నింటినీ తిరస్కరించిన మెస్సీ అమెరికా తీర ప్రాంతమైన మియామీకి ఓటేశాడు. ఫ్రీ ఏజెంట్‌గా అక్కడ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఈ డీల్‌పై ఇంటర్ మియామీ(ఇంటర్ Miami) ఓనర్ సంతోషం వ్యక్తం చేస్తూ మెస్సీని మా జట్టుకు తేవడానికి 3 యేళ్లు పట్టిందని వెళ్లడించాడు. మెస్సీకి సంవత్సరానికి 50 మిలియన్ డాలర్ల నుంచి 60 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు వెల్లడించాడు. మెస్సీ జట్టు నుంచి రిటైరైన తర్వాత జట్టు యాజమాన్యంలో భాగం లభిస్తుందని తెలిపాడు.

అయితే మెస్సీ ఆ జట్టు తరఫున ఆడుతున్నాడని వార్తలు రాగానే మ్యాచ్ టికెట్ ధరలను ఏకంగా 1000 డాలర్లు చెల్లించడానికి కూడా అభిమానులు వెనుకాడలేదు. ఇది సాధారణం కంటే 500 శాతం పైగా అధికం అయితే మెస్సీ ఆరంగ్రేటం ఎపుడో కచ్చితంగా తెలియకపోవడంతో ధరలు 350 డాలర్లకు దిగివచ్చాయి. ఇటీవల ఒక అభిమాని మెస్సీ కోసం సుమారు 1200 మైళ్లు ప్రయాణించి, మెస్సీ ఆడటం లేదని నిరాశతో వెనుదిరిగాడు.

2021లో తను ఎక్కువ కాలం ఆడిన స్పెయిన్ బార్సిలోనా క్లబ్ నుంచి ఆర్థిక కారణాలతో వీడినప్పటికీ, క్లబ్ అతనికి బాకీ పడింది. అతడి బకాయిలను ఇప్పటికీ చెల్లిస్తున్నామని, 2025 దాకా ఇది కొనసాగనుందని క్లబ్ ప్రెసిడెంట్ లాపోర్టా వెల్లడించాడు.


Leo Messi





Tags

Read MoreRead Less
Next Story