Lovlina Borgohain: కూరగాయలు అమ్మిన చేతులే ఇప్పుడు ఒలింపిక్స్‌లో పతకాన్ని..

Lovlina Borgohain: కూరగాయలు అమ్మిన చేతులే ఇప్పుడు ఒలింపిక్స్‌లో పతకాన్ని..
ఎవరు ఏం కావాలన్నది ముందే నిర్ణయించబడుతుందేమో. అందుకే లవ్లీనా.. ఇద్దరు అక్కలతో పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా ఏదో తెలియని అసంతృప్తి.

Lovlina Borgohain: ఎవరు ఏం కావాలన్నది ముందే నిర్ణయించబడుతుందేమో. అందుకే లవ్లీనా.. ఇద్దరు అక్కలతో పాటు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా ఏదో తెలియని అసంతృప్తి. ఇంకేదో చేయాలన్న ఆలోచన. ఆరోజు కోసమే ఎదురు చూసింది. వెతకబోయిన తీగ కాలికే తగిలినట్టు ఓ ఫైన్ డే నాన్న తెచ్చిన పేపర్ కటింగ్‌తో తన కల నెరవేరింది. అసోం నుంచి ఒలింపిక్స్‌కు ఎంపికైన మొదటి క్రీడాకారిణిగా లవ్లీనా నిలిచింది.

జీవితం తొలి దశలో:

లవ్లీనా బోర్గోహైన్ 2 అక్టోబర్ 1997లో అసోం గోలాఘాట్‌లో జన్మించింది. తండ్రి రైతు కూలీ. అతడి నెలవారీ వేతనం రూ. 1300. లవ్లీ నాన్నకి చేదోడు వాదోడుగా ఉండి కుటుంబ పోషణకు సహాయపడేది. ఆమెకు ఇద్దరు అక్కలు లిసా బోర్గోహైన్, లిమా బోర్గోహైన్. ఇద్దరూ కవలలు. లవ్లీనా కుటుంబం ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉండేది. అయినా అమ్మానాన్న ఆమె ఆశయాలకు ఎన్నడూ అడ్డు చెప్పలేదు. చిన్నప్పటి నుండి చాలా కష్టపడేది. గోలాఘాట్‌లో మార్కెట్‌లో కూరగాయలను విక్రయించేది. ఇద్దరు సోదరీమణులు వరుసగా BSF మరియు CISF లో సేవ చేస్తున్నారు.

ఆమె బాల్యం ఇతర పిల్లల కంటే భిన్నంగా ఉండేది. ఆమె వయస్సు కంటే ఎక్కువ ఎత్తుగా ఉండేది. మేఖేలా-సదోర్ అని అస్సామీ సాంప్రదాయ మహిళల ధరించే దుస్తులు ధరించడం కంటే ప్యాంటు, టీ షర్టులు ధరించడాన్ని లవ్లీనా చాలా ఇష్టపడేది. ఆ దుస్తులు ధరించాలనే కారణంతోనే స్కూలు తరచూ మానేస్తుండేది. అస్సాంలోని ప్రభుత్వ పాఠశాలలో మేఖేలా-సదోర్ ధరించడం తప్పనిసరి.

కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చదువు మానేసిన తర్వాత చేపల పెంపకం ప్రారంభించింది. ఒక రోజు ఆమె తండ్రి న్యూస్ పేపర్‌లో ప్యాక్ చేసిన స్వీట్లు తీసుకువచ్చారు. అప్పుడు ఆ పేపర్‌లో గొప్ప బాక్సర్ అయిన మొహమ్మద్ అలీ గురించి రాసిన ఒక కథనాన్ని చదివింది. "బాక్సింగ్" అనే పదం గురించి ఆమె మొదటిసారి తెలుసుకుంది ఆ రోజే.

లవ్లీనా జీవితంలో కీలక మలుపు

లవ్లీనా ఇద్దరు అక్కలు ముయే-థాయ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేసేవారు. కాబట్టి, లవ్లీనా కూడా వారితో కలిసి ప్రాక్టీస్ చేసేది. కానీ ఆమెకు మార్షల్ ఆర్ట్స్ కంటే బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. మార్షల్ ఆర్ట్స్ కోచ్ ఆమెను 2012 లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన 'పదుం బోరో' అనే ట్రైనర్‌కి పరిచయం చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమె ప్రతిభను చూసి ఆమెను గౌహతికి తీసుకువచ్చింది. ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాక్సింగ్‌లో ఆమె ప్రతిభకు అనేక బహుమతులు, బిరుదులు దక్కాయి.

కెరీర్ సమాచారం

2012 లో కోల్‌కతాలో జరిగిన సబ్ జూనియర్ బాక్సింగ్‌లో లవ్లీనా మొదట గోల్డ్ మెడల్ గెలుచుకుంది. సెర్బియా, 2013 లో జరిగిన ఇంటర్నేషనల్ నేషన్ కప్‌లో సిల్వర్ మెడల్ సాధించింది. 2016 లో, లవ్లినా మొదట సీనియర్ కేటగిరీ బాక్సింగ్‌ని ఆడింది కానీ ఏ ట్రోఫీని గెలవలేకపోయింది. తరువాత ఆమె కజకిస్తాన్, 2017 లో జరిగిన ప్రెసిడెంట్స్ కప్‌లో ఎంపికై అత్యుత్తమ ఆటను కనబరిచి కాంస్య పతకాన్ని సాధించింది.

వియత్నాంలో జరిగిన ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2017 లో కూడా కాంస్య పతకాన్ని చేజిక్కించుకుంది. అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2018 లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. కామన్వెల్త్ గేమ్స్ 2018 లో కూడా ఆమె ఎంపికైంది కానీ ఏ పతకం గెలవలేదు. ఆమె 2018 లో మంగోలియాలో జరిగిన ఉలాన్‌బాటర్ కప్‌లో రజతాన్ని గెలుచుకుంది మరియు 13 వ అంతర్జాతీయ సిలేసియన్ ఛాంపియన్‌షిప్ 2018 లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

ఢిల్లీలో జరిగిన AIBA ఉమెన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2018 లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. లవ్లినా తన మొదటి ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో 69 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. చైనాలో జరిగిన తన 2 వ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2019 లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆటలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను 2020 సంవత్సరంలో అర్జున అవార్డును అందుకుంది.

టోక్యో ఒలింపిక్స్ 2020 లో లవ్లినా బోర్గోహైన్

2020 ప్రారంభంలో, ఆమె ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మఫ్తునాఖాన్ మెలీవాను ఓడించి ఒలింపిక్స్‌లో తన స్థానాన్ని దక్కించుకుంది. చైనాకు చెందిన గుహాంగ్‌తో పోటీకి దిగిన లవ్లీనా సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయింది. కాంస్యంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కానీ ఒలింపిక్స్‌లో ఆడాలన్న తన లక్ష్యం నెరవేరింది. ఇదే స్ఫూర్తితో ఈసారి ఒలింపిక్స్ పసిడి పతకం సాధించాలన్నది లవ్లీనా లక్ష్యం.

Tags

Read MoreRead Less
Next Story