MI vs LSG: ముంబైపై లక్నో విజయం..

MI vs LSG: ముంబైపై లక్నో విజయం..
స్టోయినిస్ ఆల్‌రౌండ్ షో..

ఐపీఎల్ 2024లో భాగంగా.. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది. లక్నో.. 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. లక్నో బ్యాటింగ్లో మార్కస్ స్టోయినీస్ 62 పరుగులు చేసి మరోసారి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత.. కేఎల్ రాహుల్ 28 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన అర్షిణ్ కులకర్ణి డకౌట్తో పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత.. దీపక్ హుడా 18 పరుగులు చేసి ఔటయ్యాడు. నికోలస్ పూరన్, టర్నర్, బడోని , కృనాల్ పాండ్యా పరుగులు చేశారు. ముంబై బౌలింగ్లో హార్ధిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. నువాన్ తుషార, కొయెట్జీ, నబీ తలో వికెట్ సాధించారు. ఈ ఆరో విజ‌యం ఖాతాలో వేసుకున్న ల‌క్నో మూడో స్థానానికి ఎగ‌బాకి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ స్వల్ప స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు సాధించింది. ముంబై బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ 32 పరుగులు చేశాడు. వికెట్లు కోల్పోతున్న నిలకడగా ఆడి.. జట్టు స్కోరును పెంచాడు. బర్త్ డే బాయ్ రోహిత్ శర్మ 4 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత మిస్టర్ 360 సూర్య కుమార్ 10, తిలక్ వర్మ 7, హార్ధిక్ పాండ్యా డకౌట్తో ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన నేహల్ వద్వేరా 46, టిమ్ డేవిడ్ 35 క్రీజులో నిలవడంతో ముంబై స్కోరు 144 పరుగులు చేయగలిగింది. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. స్టోయినీస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ సంపాదించారు.

Tags

Read MoreRead Less
Next Story