జాతీయ జూనియర్ హాకీ ఛాంపియన్‌గా మధ్యప్రదేశ్

13వ హాకీ భారత జాతీయ పురుషుల జూనియర్ హాకీ ఛాంపియన్‌షిప్‌ను మధ్యప్రదేశ్ కైవసం చేసుకుంది. ఒడిషా రాజధాని భువనేశ్వర్ బిర్సా ముండా హాకీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఛండీఘడ్‌ను 4-2 గోల్స్ తేడాతో ఓడించి కప్ కైవసం చేసుకుంది.
మధ్యప్రదేశ్ జట్టు తరపున శ్రేయాస్ ధూపే 17, 46 నిమిషాల వద్ద రెండు గోల్స్ చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. మహ్మద్ కొనైడ్ డాడ్, అలీ అహ్మద్ 25, 52 నిమిషాల వద్ద గోల్స్ కొట్టారు. కాగా చండీఘఢ్ తరఫున సుమిత్, సురీందర్ సింగ్‌లు 9, 31 నిమిషాల వద్ద గోల్స్ చేశారు.
3వ స్థానం కోసం జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా 3-1 గోల్స్ తేడాతో ఒడిషా జట్టుని ఓడించింది. హర్యానా నుంచి శుభమ్ (4'), కెప్టెన్ రోహిత్ (28'), ప్రిక్షిత్ పంచల్ (51')లు ఒక్కో గోల్స్ చేసి విజయం ఖరారు చేశారు. ఒడిశాకు నుంచి ఏకైక గోల్ 53 నిమిషాల వద్ద ఆకాష్ సోరెంగ్ కొట్టాడు.
ఒడిషాతో జరిగిన రెండో సెమీ-ఫైనల్‌లో మధ్యప్రదేశ్ 4-4 గోల్స్ తేడాతో ఒడిషా టీంని ఓడించింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు సమానంగా 4 గోల్స్ చేయడంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఈ షూటౌట్ హోరాహోరీగా సాగింది. ఇరుజట్లు కలిపి 23 మంది గోల్ పోస్ట్‌లోకి బాల్ పంపగలిగారు. సుందరం సింగ్ రజావత్, శ్రేయాస్ ధూపేలు షూటౌట్‌లో 3 సార్లు సఫలమయ్యారు. మధ్యప్రదేశ్ గోల్‌కీపర్ అమాన్ ఖాన్ ఒడిశా ఆటగాడి గోల్ ఆపి జట్టుని ఫైనల్‌కి చేర్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com