క్రీడలు

మహీ ఏమైంది నీకు.. ఎందుకిలా: ఫ్యాన్స్ పరేషాన్

సడెన్‌గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోని చూస్తే క్రికెట్ ప్రియులు.. అందునా ధోని ఫ్యాన్స్ సరిగ్గా ఇలానే ఆలోచిస్తారు.

మహీ ఏమైంది నీకు.. ఎందుకిలా: ఫ్యాన్స్ పరేషాన్
X

మిస్టర్ కూల్ టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఈ గెటప్ బానే ఉంది కానీ ఎందుకిలా.. భార్య బిడ్డల్ని వదిలేసి సన్యాసం స్వీకరిస్తున్నాడా ఏంటి.. ఎందుకు మహీ.. మంచి భార్య, క్యూట్ బేబీ.. ఓ ఫామ్ హౌస్.. అందులో మొక్కలు, జంతువులు.. వాటి మధ్యలో సూర్యాస్తమయాలు.. లైఫ్ సెట్.

మరేంటి ఈ ఆలోచన.. సడెన్‌గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటోని చూస్తే క్రికెట్ ప్రియులు.. అందునా ధోని ఫ్యాన్స్ సరిగ్గా ఇలానే ఆలోచిస్తారు. కానీ ఓ పక్రటన కోసం మిస్టర్ కూల్ ఈ అవతారమెత్తారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు అభిమానులు.

స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రకటన కోసం ధోనీని ఇలా మార్చేసింది. మైదానంలో ప్రశాంతంగా కనిపించే మహీ.. సన్యాసి గెటప్‌లో కనిపించి మరింత ప్రశాంతంగా ఉన్నాడంటూ నెటిజన్స్ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. ధోనీ ఎలా ఉన్నా ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాడు.. ఆటలో యోధుడిలా, ఓపిక ప్రదర్శించడంలో సన్యాసిలా ఉండడం ధోనీకే చెల్లుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

కెరీర్ ఆరంభం నుంచి డిఫరెంట్ స్టైల్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్న ధోనీ ఇప్పుడు ఈ గెటప్‌లో కూడా ఫ్యాన్స్‌కి మరింత చేరువయ్యాడు. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఐపీఎల్-14 కోసం చెన్నైలో ధోనీ ప్రాక్టీస్ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES