IPL: మళ్లీ కెప్టెన్‌గా మహేంద్రుడు

చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయికి గాయమైంది. దీంతో నేడు జరిగే మ్యాచ్‌లో అతడు ఆడకపోతే జట్టును ఎవరు నడిపిస్తారన్న ప్రశ్న తలెత్తింది. దీనిపై సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్ మైకేల్ హస్సీ మాట్లాడుతూ.. ఇవాళ్టీ మ్యాచ్‌లో రుతురాజ్ ఆడకపోతే స్టంప్స్ వెనుక ఉన్న వ్యక్తి జట్టును నడిపిస్తాడని పరోక్షంగా ధోనీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీంతో రేపటి మ్యాచ్ ధోనీ సారథ్యంలో జరగనుందని తెలుస్తోంది. పాక్ స్టేడియంలో ప్రాక్టీస్ సందర్భంగా అతడి ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తామని తెలిపాడు. అతడు ఆడేది.. లేనిది.. మ్యాచ్ రోజే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు. రుతురాజ్ ఈ మ్యాచ్‌కు దూరమైతే.. కెప్టెన్‌గా ఎవరికి అవకాశం ఇస్తారని ప్రశ్నించగా.. స్టంప్స్ వెనకలా చురుగ్గా కదిలే ఓ ‘యువకుడికి’ అంటూ హింట్ ఇచ్చాడు. రుతురాజ్ ఇప్పటికీ నొప్పితో బాధపడుతున్నాడని తెలిపాడు.
రుతురాజ్ దూరమైతేనే..
శనివారం జరిగే మ్యాచ్‌కు రుతురాజ్ దూరమైతే.. మహీయే కెప్టెన్ అన్నమాట. దీంతో సారథ్య బాధ్యతల్లో ధోనీని మరోసారి చూసే అవకాశం అభిమానులకు దక్కనుంది. ఇక మహేంద్ర సింగ్ ధోనీ.. చివరి సారిగా చెన్నైకి 2023లో కెప్టెన్సీ చేశాడు. ఆ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఐదు సార్లు టైటిల్ అందించి.. ఎక్కువ సార్లు టైటిల్ గెలిచిన ముంబయి సరసన చెన్నైని నిలిపాడు. ఆ తర్వాత సీజన్ నుంచి రుతురాజ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్
ఐపీఎల్ లో రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఓపెనర్ గా నాలుగు సెంచరీలు చేయడంతో పాటు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టుకు ఆడుతున్నప్పుడు బట్లర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసేవాడు. కొన్నిసార్లు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేస్తూ ఫినిషింగ్ బాధ్యతలు చేపట్టాడు. ఇదిలా ఉంటే.. బట్లర్ ఓపెనర్ గా మారడానికి ఐపీఎల్ కారణమని చెప్పాడు. తనకు ఓపెనర్ గా అవకాశం ఇచ్చినందుకు అప్పటి ముంబై హెడ్ కోచ్ మహేల జయవర్ధనేకు రుణపడి ఉంటానని అతను చెప్పాడు. బట్లర్ మాట్లాడుతూ.. "నేను బ్యాటింగ్ ఆర్డర్ లో లోయర్ ఆర్డర్ నుంచి ఓపెనర్ గా మారడాన్ని చాలా ఆస్వాదించాను. నా కెరీర్ ప్రారంభంలో నేను మిడిల్ ఆర్డర్ లేదా లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసేవాడిని. టీ20 క్రికెట్‌లో ఓపెనర్‌గా అవకాశం ఇచ్చినందుకు మహేల జయవర్ధనేకు నేను చాలా రుణపడి ఉంటాను. పవర్‌ప్లే ఎలా ఆడాలో తెలుసుకున్నాను. పవర్ ప్లే తర్వాత ఎలా బ్యాటింగ్ చేయాలో అప్పటికీ నాకు తెలుసు". అని బట్లర్ చెప్పుకొచ్చాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com