MLC-Cricket:అమెరికాలో IPL తరహా లీగ్ రేపే, ప్రత్యక్షప్రసారం ఎందులో అంటే
భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ League) ఎంత విశేష ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఐపీఎల్ తర్వాత విండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్,శ్రీలంక, పాకిస్థాన్ దేశాల్లో చాలా లీగ్‌లు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ క్రికెట్ ఫీవర్ అమెరికాను తాకనుంది. మేజర్ లీగ్ క్రికెట్(Major Cricket League) పేరుతో ఈ లీగ్ ఆరంభమవనుంది.
ఈ లీగ్‌లోని పలు జట్లను ఐపీఎల్(IPL) ఫ్రాంఛైంజీ యాజమాన్యాలే నిర్వహిస్తున్నాయి. లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, MI న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్ ఫ్రీడం, సియాటెల్ ఆర్కాస్ జట్లు పోటీ పడనున్నాయి.
IPLల్లో అదరగొట్టిన కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, డుప్లెసిస్, డికాక్, ఫించ్ వంటి ప్రముఖ ఆటగాళ్లందరూ ఆడనున్నారు. ఉన్ముక్త్ చంద్ లాంటి భారత ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు.
భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఈ లీగ్ ప్రారంభమవనుంది. జులై 31న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
సింగిల్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జట్ల మధ్య మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతీ జట్టు మరో జట్టుతో 1 మ్యాచ్ ఆడుతుంది. మొత్తం 19 మ్యాచులుగా జరిగే టోర్నీలో ఐపీఎల్ తరహాలోనే క్వాలిఫయర్స్-1, ఎలిమినేటర్, క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లుగా జరగున్నాయి. మొదటి మ్యాచ్ టెక్సాస్ సూపర్ కింగ్స్, లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ మధ్య జరగనుంది.
భారత్‌లో ఈ మ్యాచ్‌లను స్పోర్ట్స్18 టీవీ ఛానల్, ఆన్‌లైన్‌లో జియో సినిమా(JIO Cinima)లు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి.
జట్లు ఇవే..
లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్
ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ (సి), ఉన్ముక్త్ చంద్, జస్కరన్ మల్హోత్రా, జాసన్ రాయ్, లాకీ ఫెర్గూసన్, మార్టిన్ గప్టిల్, ఆడమ్ జంపా, రిలీ రోసోవ్, స్పెన్సర్ జాన్సన్, అలీ ఖాన్, నితీష్ కుమార్, కార్న్ డ్రై, అలీ షేక్, సైఫ్ బదర్, షాడ్లీ వాన్, షాల్క్‌విక్, భాస్కర్ యాడ్రం, గజానంద్ సింగ్.
శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్
ఆరోన్ ఫించ్ (సి), చైతన్య బిష్ణోయ్, మార్కస్ స్టోయినిస్, స్మిత్ పటేల్, లుంగి నిడిగి, కోరీ అండర్సన్, డేవిడ్ వైట్, లియామ్ ప్లంకెట్, తజిందర్ సింగ్ కార్మి లే రౌక్స్, బ్రాడీ కౌచ్, సంజయ్ కృష్ణమూర్తి, అమిలా అపోన్సో.
MI న్యూయార్క్
కీరన్ పొలార్డ్ (C), ట్రెంట్ బౌల్ట్, రషీద్ ఖాన్, నోస్తుష్ కెంజిగే, మొనాంక్ పటేల్, సర్బ్‌జీత్ లడ్డా, హమ్మద్ ఆజం, ఎహ్సాన్ ఆదిల్, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ వైస్, కగిసో రబడ, నికోలస్ పూరన్, జాసన్ బెహ్రెండోర్ఫ్, స్టీవెన్ టాడీలోర్ఫ్ , జస్దీప్ సింగ్, షాయన్ జహంగీర్, కైల్ ఫిలిప్, సాయిదీప్ గణేష్, జస్దీప్ సింగ్.
సీటెల్ ఓర్కాస్
క్వింటన్ డి కాక్, వేన్ పార్నెల్ (సి), శుభమ్ రంజానే, ఆరోన్ జోన్స్, దసున్ షనక, ఏంజెలో పెరీరా, మాథ్యూ ట్రాంప్, హర్మీత్ సింగ్, షెహన్ జయసూర్య, కెమెరూన్ గానన్, నౌమన్ అన్వర్, ఫణి సింహాద్రి, నిసర్గ్ పటేల్
వాషింగ్టన్ ఫ్రీడమ్
గ్లెన్ ఫిలిప్స్, ఆడమ్ మిల్నే, మోయిసెస్ హెన్రిక్స్ (సి), జోష్ ఫిలిప్, అన్రిచ్ నోర్ట్జే, తన్వీర్ సంఘా, మార్కో జాన్సెన్, ఆండ్రీస్ గౌస్, ముఖ్తార్ అహ్మద్, ఒబస్ పినార్, సౌరభ్ నేత్రవల్కర్, సాద్ అలీ, డేన్ గౌడ, జస్టిన్, సుజిత్ పియెట్, అఖిలేష్ బొడుగుమ్, బెన్ ద్వార్షుయిస్, ఉస్మాన్ రఫిక్
టెక్సాస్ సూపర్ కింగ్స్
ఫాఫ్ డుప్లెసిస్ (సి), డెవాన్ కాన్వే, లాహిరు మిలాంత, మిలింద్ కుమార్, సమీ అస్లాం, కామెరాన్ స్టీవెన్‌సన్, మిచెల్ సాంట్నర్, డేనియల్ సామ్స్, గెరాల్డ్ కోయెట్జీ, డ్వేన్ బ్రావో, రస్టీ థెరాన్, డేవిడ్ మిల్లర్, కాల్విన్ సావేజ్, కోడి చెట్టి, జియా షాజాద్, ఎండీ మొహ్సిన్, సాయితేజ ముక్కమల్ల
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com