Mayank Agarwal : పంజాబ్ కొత్త కెప్టెన్‌‌గా మయాంక్ అగర్వాల్..!

Mayank Agarwal : పంజాబ్ కొత్త కెప్టెన్‌‌గా మయాంక్ అగర్వాల్..!
Mayank Agarwal : పంజాబ్ కొత్త కెప్టెన్‌‌గా మాయంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ టీమ్ అధికారికంగా ప్రకటించింది.

Mayank Agarwal : పంజాబ్ కొత్త కెప్టెన్‌‌గా మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. గతంలో పంజాబ్ కెప్టెన్‌‌గా ఉన్న కేఎల్ రాహుల్ లక్నో టీమ్‌‌కి వెళ్ళడంతో ఇతడికి పగ్గాలు అప్పగించారు. 31 ఏళ్ల మయాంక్ 2018 నుంచి జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు. 2011లో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన మయాంక్.. 100 మ్యాచ్‌లు ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కెరీర్ ఆరంభించిన మయాంక్ .. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్ల తరుపున ఆడాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మంది కెప్టెన్లను వాడిన ఫ్రాంఛైజీగా పంజాబ్ కింగ్స్‌కి రికార్డు ఉంది. మయాంక్ అగర్వాల్ పంజాబ్ జట్టుకు 13వ కెప్టెన్‌ కావడం విశేషం.



Tags

Next Story