MESSI: రాజకీయ నేతల కోసం మెస్సీను తెచ్చారా..?

MESSI: రాజకీయ నేతల కోసం మెస్సీను తెచ్చారా..?
X
కోల్‌కత్తా అభిమానుల తీవ్ర ఆగ్రహం... సాల్ట్‌లేక్ మైదానంలో గందరగోళం... ముందుగానే మైదానం వీడిన మెస్సీ... మెస్సీని చూడలేకపోయిన ఫ్యాన్స్

ఫు­ట్‌­బా­ల్ ది­గ్గ­జం లి­యో­నె­ల్ మె­స్సీ­ని దగ్గర నుం­చి చూ­ద్దా­మ­ని వేల రూ­పా­య­లు ఖర్చు చేసి వచ్చిన అభి­మా­ను­ల­కు తీ­వ్ర ని­రాశ ఎదు­రైం­ది. కో­ల్‌­క­తా­లో­ని వి­వే­కా­నంద యు­వ­భా­ర­తి సా­ల్ట్ లేక్ స్టే­డి­యం­లో జరి­గిన ఈవెం­ట్ తీ­వ్ర గం­ద­ర­గో­ళా­ని­కి, ఉద్రి­క్త­త­కు దా­రి­తీ­సిం­ది. తమ అభి­మాన ఆట­గా­డు మై­దా­నం­లో కే­వ­లం పది ని­మి­షాల లోపే కని­పిం­చి వె­ళ్లి­పో­వ­డం­తో ఫ్యా­న్స్ ఆగ్ర­హం­తో ఊగి­పో­యా­రు. టి­కె­ట్ల కోసం రూ. 5,000 నుం­చి రూ. 12,000 వరకు చె­ల్లిం­చి, గంటల తర­బ­డి ఎదు­రు­చూ­సిన అభి­మా­ను­లు.. మె­స్సీ కా­సే­ప­టి­కే మై­దా­నం వీ­డ­టం­తో సహనం కో­ల్పో­యా­రు. ని­ర­స­న­గా స్టే­డి­యం­లో­ని స్టాం­డ్స్‌­లో ఆం­దో­ళ­న­కు ది­గా­రు. కొం­ద­రు బా­టి­ళ్లు వి­స­ర­గా, మరి­కొం­ద­రు హో­ర్డిం­గు­ల­ను ధ్వం­సం చే­శా­రు. పరి­స్థి­తి అదు­పు తప్పు­తుం­డ­టం­తో భద్ర­తా సి­బ్బం­ది రం­గం­లో­కి దిగి అభి­మా­ను­ల­ను చె­ద­ర­గొ­ట్టా­ల్సి వచ్చిం­ది.

ఈ ఘట­న­పై ఓ అభి­మా­ని తీ­వ్ర ఆవే­దన వ్య­క్తం చే­శా­డు. ఁనా­య­కు­లు, నటు­లు మా­త్ర­మే మె­స్సీ చు­ట్టూ ఉన్నా­రు. అలాం­ట­ప్పు­డు మమ్మ­ల్ని ఎం­దు­కు పి­లి­చా­రు? రూ.12,000 పె­ట్టి టి­కె­ట్ కొ­న్నాం, కానీ అతని ముఖం కూడా సరి­గా చూ­డ­లే­క­పో­యాంఁ అని వా­పో­యా­డు. ని­ర్వా­హ­కుల వై­ఫ­ల్యం వల్లే ఇలా జరి­గిం­ద­ని, ఇది మోసం చే­య­డ­మే­న­ని పలు­వు­రు ఆరో­పిం­చా­రు.అం­త­కు­ముం­దు, మూడు రో­జుల భారత పర్య­ట­న­లో భా­గం­గా కో­ల్‌­క­తా­కు చే­రు­కు­న్న మె­స్సీ­కి ఘన స్వా­గ­తం లభిం­చిం­ది. బా­లీ­వు­డ్ నటు­డు షా­రు­ఖ్ ఖాన్, పశ్చిమ బెం­గా­ల్ మం­త్రి సు­జి­త్ బో­స్‌­తో కలి­సి ఆయన 70 అడు­గుల వి­గ్ర­హా­న్ని వర్చు­వ­ల్‌­గా ఆవి­ష్క­రిం­చా­రు.

అయి­తే, స్టే­డి­యం­లో జరి­గిన గం­ద­ర­గో­ళం కా­ర­ణం­గా ము­ఖ్య­మం­త్రి మమతా బె­న­ర్జీ, సౌ­ర­వ్ గం­గూ­లీ­తో జర­గా­ల్సిన సమా­వే­శా­ల­ను మె­స్సీ రద్దు చే­సు­కు­న్న­ట్లు సమా­చా­రం. భద్ర­తా కా­ర­ణాల దృ­ష్ట్యా ఆయన ముం­దు­గా­నే వి­మా­నా­శ్ర­యా­ని­కి చే­రు­కు­ని, తన పర్య­ట­న­లో తదు­ప­రి నగ­ర­మైన హై­ద­రా­బా­ద్‌­కు బయ­లు­దే­రా­రు. కాగా సా­ల్ట్ లేక్ స్టే­డి­యం­లో జరి­గిన ఘట­న­ల­పై బెం­గా­ల్ సీఎం మమతా బె­న­ర్జీ స్పం­దిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా మె­స్సి­కి, అతడి అభి­మా­ను­ల­కు క్ష­మా­పణ చె­ప్పా­రు. స్టే­డి­యం­లో జరి­గిన ని­ర్వ­హణ లో­పా­న్ని చూసి.. షాక్ అయి­న­ట్లు చె­ప్పా­రు. మె­స్సి­ని చూ­సేం­దు­కు తాను కూడా బయ­లు­దే­రా­న­ని.. కానీ అక్క­డి పరి­స్థి­తి గు­రిం­చి తె­లు­సు­కు­ని వె­ను­ది­రి­గి­న­ట్లు పే­ర్కొ­న్నా­రు. ని­ర్వ­హణ వై­ఫ­ల్యా­ని­కి కా­ర­ణ­మైన వా­రి­పై చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని.. భవి­ష్య­త్‌­లో ఇలాం­టి ఘట­న­లు జర­గ­కుం­డా చర్య­లు తీ­సు­కుం­టా­మ­ని తె­లి­పా­రు. ఈ ఘట­న­పై వి­చా­రణ కోసం జస్టి­స్ అషి­మ్ కు­మా­ర్ అధ్య­క్ష­తన వి­చా­రణ కమి­టీ ఏర్పా­టు చే­య­ను­న్న­ట్లు ప్ర­క­టిం­చా­రు. ది గోట్ టూ­ర్‌­‌­లో భా­గం­గా మె­స్సీ మూడు రో­జుల పర్య­టన కోసం భా­ర­త్‌­కు వచ్చా­డు. శని­వా­రం తె­ల్ల­వా­రు జా­మున కో­ల్‌­క­తా­లో ల్యాం­డ్ అయ్యా­డు. షె­డ్యూ­ల్ ప్ర­కా­రం అతడు కో­ల్‌­క­తా­లో­ని సా­ల్ట్ లేక్ స్టే­డి­యం­లో మ్యా­చ్ ఆడా­ల్సి ఉంది. దీం­తో అత­డి­ని చూ­సేం­దు­కు పె­ద్ద సం­ఖ్య­లో అభి­మా­ను­లు స్టే­డి­యా­ని­కి తర­లి­వ­చ్చా­రు.మె­స్సి­ని దగ్గ­రి నుం­చి చూ­డా­ల­ని.. ఆటను వీ­క్షిం­చా­ల­ని అభి­మా­ను­లు పె­ద్ద సం­ఖ్య­లో స్టే­డి­యా­ని­కి తర­లి­వ­చ్చా­రు. అయి­తే మె­స్సి మా­త్రం.. మ్యా­చ్ ఆడ­కుం­డా­నే స్టే­డి­యం నుం­చి వె­ళ్లి­పో­యా­డు. అలా వచ్చి.. ఇలా మై­దా­నం వీ­డా­డు. దీం­తో అభి­మా­ను­లు తీ­వ్ర ని­రు­త్సా­హా­ని­కి గు­ర­య్యా­రు. మె­స్సి కోసం వస్తే.. పది ని­మి­షా­లు కూడా లే­క­పో­వ­డం ఏం­ట­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు.

Tags

Next Story