మెస్సీ కోసం 1200 మైళ్ల దూరం ప్రయాణం, అయినా నిరాశే..

ఫుట్‌బాల్ మాంత్రికుడు, అర్జెంటీనా స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీని చూడటానికి ఓ అభిమాని ఏకంగా 1200 మైళ్ల దూరం ప్రయాణించాడు. కానీ అతనికి నిరాశే ఎదురైంది.
అమెరికాలోని ఫిలడెల్ఫియా యూనియన్, MLS మధ్య జరిగిన మ్యాచ్‌లో మెస్సీ ఆటని ప్రత్యక్షంగా వీక్షించడానికి ఆ అభిమాని 1200 మైళ్లు ప్రయాణించి వచ్చాడు. అయితే మ్యాచ్‌లో మెస్సీ ఆడలేదు. దీంతో అతనికి నిరాశ తప్పలేదు. ఈ విషయాన్ని ఆ అభిమాని ప్లకార్డుపై రాసి వెల్లడించాడు. కోపం, నిస్పృహతో ప్లకార్డును విసిరేశాడు. క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లు.. అని ఫిలడెల్ఫియా యూనియన్ టీం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ మ్యాచ్‌లో ఫిలడెల్ఫియా టీం 4-1 గోల్స్ తేడాతో మియామిని ఓడించింది.
అయితే లియోనల్ మెస్సీ వెకేషన్‌లో ఉన్నాడు. మరియు జూన్ 24న తన చిన్ననాటి క్లబ్ అయిన న్యూవెల్స్ ఓల్డ్ బాయ్స్ క్లబ్‌తో ఓ ఆటగాడి ఫేర్‌వెల్ మ్యాచ్‌లో అతని తరఫున తలపడ్డాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ కొట్టాడు.
మెస్సీ ఇటీవలె పారిస్‌లోని పారిస్ సెయింట్ జెర్మైన్ (PSG) క్లబ్‌ను వీడి అమెరికాలోని ఇంటర్ మియామి క్లబ్‌లో చేరాడు. ఇప్పటి వరకు నూతన క్లబ్ తరఫున మ్యాచ్‌లో బరిలో దిగలేదు. జులైలో టీంతో మెస్సీ కలిసి ఆడతాడని మియామి యాజమాన్యం తెలిపింది. PSG తో మెస్సీ కాంట్రాక్ట్ గడువు జూన్ 30న ముగియనుండమే దీనికి కారణం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com